సాయం చేస్తే రివార్డ్ ఇస్తా... ఫ్యాన్స్ కి పవన్ హీరోయిన్ నిధి బంపర్ ఆఫర్!

First Published May 13, 2021, 12:43 PM IST

హాట్ బేబీ నిధి అగర్వాల్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కావడం మరో విశేషం.

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న యాక్షన్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాలో నిధి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
నిధి నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కావడం విశేషం. హరిహర వీరమల్లు విడుదల తరువాత నిధి స్టార్ హీరోల ఛాయిస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
ఈ చిత్రంతో పాటు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నిధి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ఓ తెలుగు, తమిళ చిత్రం ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మొదటి హిట్ అందుకున్న నిధి కెరీర్ ట్రాక్ లో పడింది.
undefined
వేడి వేడి పరువాలతో కిరాక్ పుట్టించే నిధికి యూత్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితో ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
అయితే నిధి అగర్వాల్ కి పెద్ద కష్టం వచ్చి పడింది. తన పెట్ డాగ్ తప్పిపోయిందట. దీనితో దిగులుపడ్డ నిధి అగర్వాల్ తన కుక్క ఆచూకీ చెప్పాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా వేడుకుంది.
undefined
తన పెట్ డాగ్ బ్రీడ్, ఏజ్, ఫీచర్స్ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టారు నిధి అగర్వాల్.  కుక్క ఆచూకీ తెలిపినవారికి ఏకంగా లక్ష రూపాయల బహుమానం ఆమె ప్రకటించడం విశేషం.
undefined
మరి నిధి ఫ్యాన్స్ కి ఇది సువర్ణావకాశమే అని చెప్పాలి. నిధి పెట్ డాగ్ ఆచూకీ కనుగొంటే లక్ష రూపాయల బహుమానంతో పాటు, ఆమెను కలిసే లక్ దక్కుతుంది.
undefined
ఇప్పటికే కొందరు సీరియస్ గా ట్రై చేస్తూ ఉండి ఉంటారు అనడంలో సందేహం లేదు .
undefined
click me!