చీర కట్టడం ఎప్పటికీ తప్పు కాదట.. నేషనల్‌ క్రష్‌ రష్మిక పోస్ట్.. కాజ్వల్‌ శారీలో ఎంత క్యూట్‌గా ఉందో

Published : Feb 03, 2024, 08:33 AM ISTUpdated : Feb 03, 2024, 08:35 AM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఓవర్‌ డోస్‌ గ్లామర్‌ షో చేయగలదు, ట్రెడిషనల్‌ లుక్‌లోనూ మెరవగలదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెప్పిస్తుంది. ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
చీర కట్టడం ఎప్పటికీ తప్పు కాదట.. నేషనల్‌ క్రష్‌ రష్మిక పోస్ట్.. కాజ్వల్‌ శారీలో ఎంత క్యూట్‌గా ఉందో

రష్మిక మందన్నా ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌. `పుష్ప` సినిమాతోనే ఆమె రేంజ్‌ పెరిగిపోయింది. ఇటీవల `యానిమల్‌` మూవీతో తన రేంజ్‌ని మరింత పెంచుకుంటుంది. కొందరైతే ఏకంగా పాన్‌ వరల్డ్ క్రష్‌ అని, ఇంటర్నేషన్‌ క్రష్‌ అంటున్నారు. అంతగా అలరించిందీ బ్యూటీ. 
 

27

సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక మందన్నా. ఆమె గ్లామర్‌ ట్రీట్‌తోపాటు తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ని పంచుకుంటుంది. అదే సమయంలో ప్రేమకి సంబంధించిన హింట్‌ కూడా ఇస్తుంది. ఇప్పుడు కాజ్వల్‌ లుక్‌లో మెరిసింది. 
 

37

చీర కట్టి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది రష్మిక మందన్నా. కాజ్వల్‌ శారీలో చూడ్డానికి ఇల్లాలుగా కనిపిస్తుంది. ఆమె క్యూట్‌ లుక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. 
 

47

రష్మిక మందన్నా చీరలో తన రెండు ఫోటోలను పంచుకుంటూ.. చీరకట్టడం ఎప్పటికీ తప్పు కాదు అని పేర్కొంది. దీంతో ఈ పిక్స్ మరింతగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్ స్పందిస్తూ, నువ్వు ఇంటర్నేషన్‌ క్రష్‌ అని, చీరలో ఎంత ముద్దుగా ఉందో అని, క్యూట్‌గా ఉందని అంటున్నారు. 
 

57

ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ చిత్రీకరణ త్వరలో జపాన్‌లో చిత్రీకరణ చేయబోతున్నారట. దీంతోపాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది రష్మిక మందన్నా. 
 

67
Rashmika

ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తుంది. అందులో `రెయిన్‌బో` అనే మూవీ ఒకటి, మరోవైపు `ది గర్ల్ ఫ్రెండ్‌` అని మరో సినిమా చేస్తుంది.ఇది ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైంది. దీనికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

77

దీంతోపాటు హిందీలో ఓ సినిమా చేస్తుందట. అలాగే విజయ్‌ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్‌` చిన్న పాత్రలో మెరవబోతున్నట్టు సమాచారం. మరోవైపు హిందీలోనూ సినిమా చేస్తుందని సమాచారం. మరోవైపు ధనుష్‌, నాగార్జున సినిమాలో హీరోయిన్‌గా రష్మిక ఎంపికైందంటున్నారు. మొత్తంగా రష్మిక అదిరిపోయే ఆఫర్లతో దూసుకుపోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories