GuppedanthaManasu 3rd February Episode: ముకుల్ చెర నుంచి తప్పించుకున్న భద్ర, ఆనందంలో శైలేంద్ర..!

First Published | Feb 3, 2024, 7:48 AM IST

ఓ చీడ పురుగును ఏరిపారేశాను అని చెబుతుంది. ఎవరి గురించి చెబుతున్నావ్ అంటే.. భద్ర గురించి అంటుంది. ఆ మాట విని మహేంద్ర షాకౌతాడు.
 

Guppedantha Manasu

GuppedanthaManasu 3rd February Episode: భద్ర కుట్రను వసుధార తెలివిగా బయటపెట్టిన విషయం తెలిసిందే. భద్ర అలా పోలీసులకు దొరకడం, వసుధార తనకు వార్నింగ్ ఇవ్వడం గురించి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. నిద్రపోకుండా...  అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. భద్ర గాడు నోరు విప్పి.. నిజాలు అన్నీ బయటపెట్టేస్తే ఎలా అని కంగారుపడుతూ ఉంటాడు. అప్పుడే ధరణికి మెలకువ వస్తుంది.

Guppedantha Manasu

వెంటనే లేచి.. ఏంటండి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఎలా ఉన్నాను అని శైలేంద్ర అడిగితే.. వణికిపోతున్నారు.. ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి .. చలి జ్వరం ఏమైనా వచ్చిందా కషాయం తెమ్మంటారా, ట్యాబ్లెట్ తెమ్మంటారా అని అడుగుతుంది. నాకు ఏదీ వద్దు నువ్వు పడుకో అని  శైలేంద్ర అంటాడు. కానీ, ధరణి వినిపించుకోదు. ఏదైనా మంచి జరిగిందా అని అడుగుతుంది. దానికి ఏంటి..? అని శైలేంద్ర అంటే.. మంచి వాళ్లకు ఏదైనా మంచి జరుగితే అందరూ సంతోషిస్తారు.. కానీ మీరు మాత్రం అలా సంతోషించలేరు కదా అని అంటుంది. ఇక శైలేంద్ర ఫ్రస్టేట్ అవ్వడంతో ధరణి పడుకుంటుంది. దీని టార్చర్ నాకు ఎక్కువ అయ్యింది అని  శైలేంద్ర అనుకుంటాడు.


Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. వసుధార చెప్పా పెటట్కుండా బయటకు వెళ్లిందని.. ఇంకా రాలేదేంటి అని మహేంద్ర కంగారుపడుతూ ఉంటాడు. అనుపమను ఫోన్ ఛేయమని అంటాడు. అనుపమ ఫోన్ చేసేలోగా.. వసుధార వస్తుంది. ఎక్కడికి వెళ్లావమ్మా అని మహేంద్ర, అనుపమ అడిగితే.. ఓ చీడ పురుగును ఏరిపారేశాను అని చెబుతుంది. ఎవరి గురించి చెబుతున్నావ్ అంటే.. భద్ర గురించి అంటుంది. ఆ మాట విని మహేంద్ర షాకౌతాడు.

భద్ర.. శైలేంద్ర మనిషే అని.. తనకు ముందు నుంచి అనుమానం ఉందని.. ఈ రోజు రిషి సర్ దొరికినట్లు కావాలనే భద్ర వినేలా మాట్లాడాను అని.. వాడు నన్ను ఫాలో అవుతూ వచ్చాడు అని చెబుతుంది. వాడు రావడమే కాదు.. శైలేంద్రను కూడా అక్కడికి రప్పించాడు. అని.. భద్రని మాత్రం ముకుల్ పట్టుకెళ్లాడని చెబుతుంది. శైలేంద్ర... ముకుల్ వెళ్లిపోయాక వచ్చాడనే విషయం చెబుతుంది. వాడిని కూడా అరెస్టు చేసి ఉంటే ధరిద్రం వదిలేది అని  మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. ముకుల్.. భద్రను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అయితే.. ఎంత బెదిరించినా కూడా భద్ర నిజం చెప్పడు. మహేంద్ర ఇంట్లో ఎందుకు చేరావు అంటే.. పని కోసమే చేరాను అంటాడు... ఎవరు నిన్ను అక్కడ చేరమన్నారు అని అడుగుతాడు. దానికి భద్ర సమాధానం చెప్పడు. నీకు వాళ్లు ఎంత డబ్బు ఇస్తా అన్నారో.. అంతకు మించిన  డబ్బు ఇస్తాను అని ముకుల్ ఆఫర్ ఇస్తాడు. అయితే దానికి భద్ర తనకు కొంచెం టైమ్ కావాలి అంటాడు.. ఎంత కావాలి అంటే.. ఒక పూట టైమ్ ఇస్తే చెప్పేస్తాను అంటాడు. సరే అని ముకుల్ అంటాడు.

సరిగ్గా అదే సమయానికి.. ముకుల్ టీమ్ లో ఓ వ్యక్తికి శైలేంద్ర నుంచి మెసేజ్ వస్తుంది. భద్రను తప్పించమని అడుగుతాడు. కానీ.. ఆ వ్యక్తి కష్టం సర్ అని సమాధానం ఇస్తాడు.

Guppedantha Manasu

ఆ తర్వాతి సీన్ లో.. ముకుల్.. మహేంద్ర ఇంటికి వస్తాడు. అక్కడ వాళ్లు.. భద్ర రిషి గురించి ఏమైనా సమాధానం చెప్పాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. వీడియో డిలీట్ చేసింది మాత్రం.. భద్ర నే అని..  ముకుల్ చెబుతాడు. రిషి గురించి చెప్పమని.. ఓ వైపు మహేంద్ర, మరోవైపు చక్రపాణి కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటారు. కానీ.. ముకుల్ మౌనంగా ఉండిపోతాడు. ఏమైందని అనుపమ, వసుధార రెట్టించి అడగడంతో.. భద్ర తప్పించుకున్నాడు అనే విషయం ముకుల్ చెబుతాడు. ఆ మాటకు వాళ్లు షాకౌతారు.

Guppedantha Manasu

భద్ర తప్పించుకున్న విషయం అటు శైలేంద్రకు కూడా తెలుస్తుంది. ఆ మాట విని శైలేంద్ర ఆనందంతో పొంగిపోతాడు. వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి సంతోషాన్ని పంచుకుంటాడు. వాళ్ల అమ్మ ఏమో.. ఆ భద్రగాడు పోలీసులకు దొరికిపోయాడు కదా.. మన గురించి మొత్తం చెప్పేస్తే.. మన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు అని దేవయాణి భయపడుతుంది. కానీ.. భద్ర తప్పించుకున్నాడు అనే విషయాన్ని దేవయాణికి చెబుతాడు. వీళ్ల మాటలన్నీ దూరం నుంచి ధరణి వింటూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

Latest Videos

click me!