ఆ ప్రకారంగానే `మగధీర` విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి వరకు హైయ్యెస్ట్ సినిమా రికార్డుని బ్రేక్ చేసి డబుల్, త్రిబుల్ చేసింది. దీంతో అంతా ఖుషీ అయ్యారు. నిర్మాతలు, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి ఇలా అంతా హ్యాపీగా ఉన్నారు. ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఇక నెమ్మదిగా సినిమా పోస్టర్లపై ఇన్ని రోజు, అన్ని రోజులు అని వేస్తున్నాడట నిర్మాత అల్లు అరవింద్. కలెక్షన్లు కాకుండా డేస్‌కి సంబంధించిన పోస్టర్లు వేశారట. అంతేకాదు వంద రోజులు సెంటర్లు పెంచి పోస్టర్లలో వేస్తున్నారట.