ఈ నేపథ్యంలో కన్నడనాట రష్మికని బ్యాన్ చేయాలని భావిస్తున్నారు. సినీ పెద్దలు ఆ దిశగా చర్చలు జరుపుతున్నారట. అయితే ఇందులో నిజం లేదని, కేవలం అది చర్చకు మాత్రమే వచ్చిందని, బ్యాన్ చేయడమనేది జరగదని, అందులో నిజం లేదని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో అభిమానులు రష్మికకి మద్దతులుగా నిలుస్తున్నారు. 2018లో ఆమెని ఎవరూ ఆపలేదని, ఇప్పుడు ఎవరూ ఆపలేరని, రష్మిక ఎప్పుడైనా నెంబర్ వన్నే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.