ఈరోజు ఎపిసోడ్ లో మాలిని పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వస్తుంది. అప్పుడు వేదకి హారతి తీసుకోగా మాలిని ఏ ఆటంకం లేకుండా నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్ గా సాధించాలి అని అంటుంది. అప్పుడు వేద అత్తయ్య ఏ ఆడదానికి కూడా రాని సిచువేషన్ నాకు వచ్చింది తాళి కట్టిన భర్త మీదే పోరాటం చేయాల్సిన పరిస్థితి నాది అని అంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే ఆ తప్పని కప్పపుచ్చుకోవడానికి మోసం చేస్తూ వారిని బయట పడేయాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు అని అంటుంది వేద. అటువంటి నేరస్థులకు న్యాయస్థానంలో కచ్చితంగా శిక్ష పడి తీరాలి అని అంటుంది వేద.