Rashmika Mandanna: మరోసారి అద్భుతం చేసిన రష్మిక మందన్న.. ఫిదా అవుతున్న నార్త్ ఆడియన్స్, అభిమానులు ఏమంటున్నాంటే?

Published : Jun 19, 2026, 06:13 PM IST

మరోసారి  తన సత్తా చాటింది రష్మిక మందన్న. నార్త్ ఆడియన్స్ మనసు దొచుకుంది నేషనల్ క్రష్. కాక్‌టెయిల్ 2 సినిమాలో  'దియా' పాత్రలో అదరగొట్టింది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఏమంటున్నారంటే? 

PREV
13
మరోసారి అద్భుతం చేసిన రష్మిక

కాక్‌టెయిల్ 2 రిలీజైనప్పటి నుంచి, దియా పాత్రలో రష్మిక మందన్న చూపిన సహజమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు, సినిమాకే ఓ పాజిటివ్ వైబ్ వస్తుందని అభిమానులు అంటున్నారు. రష్మిక నవ్వు, చలాకీతనం సినిమా చూస్తున్నంత సేపు తమని కూడా నవ్వించాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

23
ఫేవరెట్‌గా మారిన 'దియా'

దియా పాత్రకు రష్మిక తీసుకొచ్చిన ఎనర్జీ గురించి ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆమె నటన చాలా రిఫ్రెషింగ్‌గా, ఉత్సాహంగా ఉందని  అంటున్నారు. ముఖ్యంగా దియా పాత్రలోని ఆశావాదాన్ని రష్మిక చాలా సహజంగా పండించిందని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. 

33
రష్మిక పాజిటివ్ స్క్రీన్ ప్రెజెన్స్

రష్మిక  పాజిటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా కథకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఇచ్చిందని చాలామంది నమ్ముతున్నారు. రష్మిక నటనలోని హావభావాలు, ఎమోషనల్ సీన్స్‌ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. అందుకే చాలామంది అభిమానులు 'దియా' పాత్రను కాక్‌టెయిల్ 2 సినిమాకు గుండెకాయలాంటిదని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories