Rashmika Mandanna: ఇటీవల విడుదలైన థామా చిత్రంలో నటనకి గాను రష్మికకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తన కష్టాన్ని తెలియజేస్తూ రష్మిక ఫోటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. ఆమె నటించిన థామా చిత్రం మంగళవారం రోజు రిలీజ్ అయింది.హారర్ చిత్రంగా విడుదలైన థామాలో రష్మిక నటన అదరగొట్టింది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర సెట్స్‌లో గడిపిన అనుభవాలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది.
29
రష్మిక షేర్ చేసిన లొకేషన్ ఫోటోస్
ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలు, వీడియోను షేర్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. ఈ ఫోటోలలో రష్మికతో పాటు నటుడు అయుష్మాన్ ఖురానా, దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ కనిపించారు.
39
గాయాలతో సాగిన ప్రయాణం
రష్మిక తన పోస్ట్‌లో, “ఇది హృదయం, కృషి, నవ్వులు, గాయాల మధ్య సాగిన అందమైన ప్రయాణం” అని రాశారు. ఆమె తడక అనే పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రను సినిమాలో “మొదటి వెలుగుకిరణంగా కనిపించే ఒక రహస్యమైన వ్యాంపైర్”గా పరిచయం చేశారు. తడక పాత్ర రహస్యత, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
థామా మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగం. ఈ ఫ్రాంచైజ్‌లోని ప్రతి చిత్రంలాగే, థామా కూడా భయపెట్టే అంశాలతో పాటు హాస్యాన్ని సమపాళ్లలో కలిపి వినోదాన్ని అందిస్తుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించారు.
59
థామా ఒక పాఠం లాంటిది
రష్మిక తన సహ నటీనటుల గురించి మాట్లాడుతూ, “అయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్ తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా అనిపించింది. వారితో గడిపిన ప్రతి క్షణం ఒక పాఠం లాంటిది. ఈ చిత్ర బృందం అద్భుతంగా పని చేసింది” అని అభిప్రాయపడింది.
69
థామా కలెక్షన్స్
దిగ్గజ నిర్మాత దినేష్ విజన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన రోజే ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. ట్రేడ్ రిపోర్ట్‌ల ప్రకారం, థామా మొదటి రోజే రూ.24.87 కోట్లు వసూలు చేసింది. ఇది రష్మిక కెరీర్‌లో ఉత్తమ ఓపెనింగ్ కలిగిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
79
రష్మిక నటనకు ప్రశంసలు
దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ రూపొందించిన ఈ హారర్ కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్, కథలోని వైవిధ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రష్మిక పోషించిన తడక పాత్రకు ప్రత్యేక అభినందనలు లభిస్తున్నాయి. ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమె లుక్స్, నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
89
త్వరలో మరో చిత్రం రిలీజ్ కి రెడీ
రష్మిక మందన్న ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల రష్మిక నటించిన చిత్రాలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. పుష్ప 2, ఛావా, కుబేర లాంటి చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
99
రష్మిక కష్టానికి నిదర్శనం
థామా షూటింగ్ సమయంలో తీసిన ఈ బీహైండ్ ద సీన్స్ క్షణాలు రష్మిక అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలు థామా మూవీలో ఆమె కష్టాన్ని తెలియజేస్తున్నాయి. రేష్మిక షూటింగ్ లో గాయపడ్డ దృశ్యాలని కూడా అభిమానులతో పంచుకుంది.