Rashmika Mandanna: షూటింగ్ తర్వాత రష్మిక మందన్న ఏం చేస్తుంది? ఇంట్లో ఆమె డైలీ రొటీన్ ఎలా ఉంటుంది?

Published : Nov 27, 2026, 01:07 PM IST

Rashmika Mandanna: ప్రతీరోజు షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉండే రష్మిక మందన్న.. ఇంటికి వెళ్లాక ఏం చేస్తారో తెలుసా? బాలీవుడ్ లో కూడా పుల్ క్రేజ్ ఉన్న నేషనల్ క్రష్ ఇంట్లో చేసే రోటీన్ వర్క్ ఏంటి? రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఏం చెపుతున్నాయి?

PREV
13
షూటింగ్స్ తో బిజీ బిజీ..

సినిమా షూటింగులు, బిజీ షెడ్యూళ్లతో ఎప్పుడూ హడావుడిగా కనిపించే హీరోయిన్ రష్మిక మందన్నా, ఇంటికి వెళ్లాక ఎలా ఉంటారో తెలుసా? ఇంట్లో ఆమె రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది? ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. దానికి కారణం ఆమె షేర్ చేసిన కొన్ని పోటోలు, వీడియోలే. షూటింగ్స్ పని పూర్తయ్యాక ఇంటి వద్ద తాను గడిపే క్షణాలను పంచుకుంటూ, గ్లామర్ హంగులకు దూరంగా ఉండే తన నిజమైన హోమ్ రొ టీన్‌ను అభిమానుల ముందుంచారు రష్మిక. ఈ పోస్టును షేర్ చేస్తూ "ఇది రష్మిక టీమ్.. పని పూర్తయ్యాక ఆమె ఇంటికి వెళ్తే ఇలాగే కనిపిస్తుంది" అనే క్యాప్షన్ జోడించారు.

23
సింపుల్ లుక్‌లో చిరునవ్వుల సందడి

షేర్ చేసిన దృశ్యాల్లో మొదటి ఫొటోలో రష్మిక చాలా సింపుల్‌గా కనిపించారు. వైట్ టీ-షర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్స్ ధరించి, పింక్ హెడ్‌బ్యాండ్ పెట్టుకుని నేలపై కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఆ దృశ్యం అభిమానులకు కొత్తగా అనిపించింది. సెట్‌లో కనిపించే హడావుడి కాకుండా, ఇంట్లో రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్న ఆమె నేచురల్ లుక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఫిట్‌నెస్ కసరత్తులు, పెట్ తో ఆటలు

పని అలసటలోనూ ఫిట్‌నెస్ విషయంలో రష్మిక అస్సలు రాజీ పడటం లేదు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్సర్‌సైజ్ మ్యాట్‌పై ట్రైనర్ సహాయంతో డంబెల్స్ పట్టుకుని వర్కవుట్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ కసరత్తుల సమయంలో ఆమె పెట్ డాగ్ కూడా పక్కనే ఉండి సందడి చేసింది. ముఖ్యంగా రెడ్ ఫిట్‌నెస్ బాల్‌పై రష్మిక పడుకున్నప్పుడు, ఆ పెంపుడు శునకం ఆమెకు ముద్దులు పెడుతూ చేసిన అల్లరి వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఈ వ్యక్తిగత క్షణాలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.

33
జపాన్ ఫ్యామిలీ ట్రిప్, నెట్టింట చర్చ

ఇంటి దినచర్యతో పాటు ఇటీవల జరిగిన జపాన్ పర్యటన కూడా ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. ఇటీవలే రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ, అతని తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి జపాన్ వెళ్లి ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్ చేశారు. ఆ ట్రిప్ ఫొటోలను పంచుకుంటూ "నా అభిమాన వ్యక్తులతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను" అని విజయ్ రాసుకొచ్చారు.

అయితే గతంలో ఓ షోలో పాల్గొన్నప్పుడు, పెళ్లయ్యాక ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు తన తల్లిదండ్రులను విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడమే తన ప్రాధాన్యమని విజయ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ, విజయ్ తల్లిదండ్రులకే కాకుండా రష్మిక తల్లిదండ్రుల పట్ల కూడా సమాన బాధ్యత ఉండాలి కదా అంటూ కామెంట్లతో ప్రశ్నిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories