Actor Sivaji: బిగ్ బాస్ లో పాలిటిక్స్ నిజమే, అమ్మాయిలతో ట్రిక్స్.. ఇలా అయితే కష్టమే, శివాజీ కామెంట్స్

Published : Nov 27, 2026, 12:16 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశలో రసవత్తరంగా మారుతోంది. టైటిల్ గెలిచేది ఎవరు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

PREV
15
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 రోజులు పూర్తయ్యాయి. దీనితో విన్నర్ ఎవరు ? టాప్ 5 లో ఉండేది ఎవరు అంటూ నెటిజన్లు, బిగ్ బాస్ అభిమానులు ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తున్నారు. అయితే త్రిగుణ్, ముకేశ్, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు టాప్ 3లో ఉంటారు అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రముఖ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
టాప్ 5పై శివాజీ అంచనా

అలీ హోస్ట్ గా చేస్తున్న టాక్ షోలో శివాజీ పాల్గొన్నారు. తన అంచనా ప్రకారం టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది బయటపెట్టారు. త్రిగుణ్, నరేష్, ముకేశ్, దేబ్జానీ టాప్ 5 లో ఉంటారు. 5 వ స్థానంలో రామ్ ప్రసాద్, వంశీ, అమన్ వీరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ ఎలా జరుగుతోంది ? అనే ప్రశ్నకు శివాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

35
బిగ్ బాస్ లో పాలిటిక్స్

ప్రస్తుతం బిగ్ బాస్ లో పాలిటిక్స్ జరుగుతున్నాయి. అది వాస్తవమే. ఎవరిని ఉంచితే ఎవరు డౌన్ అవుతారు ? ఒక అమ్మాయి హౌస్ లో ఉంటే ఆమె చుట్టూ ఎవరు తిరుగుతారు ? ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అమ్మాయి చుట్టూ ఎవరైనా తిరుగుతుంటే వాడిని వెనక్కి నెట్టేయొచ్చు అనే స్ట్రాటజీలు ప్లే అవుతున్నాయి. ఇలా అయితే బిగ్ బాస్ కష్టమే అని శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

45
90 రోజులు పూర్తి

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 90 రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం హౌస్ లో త్రిగుణ్, ముకేశ్, రామ్ ప్రసాద్, నరేష్, అమన్ , సుధీర్, వైల్డ్ కార్డు కంటెస్టెంట్ శివ కుమార్, దేబ్జానీ, వర్షిణి, వంశీ, ఆర్కే ఉన్నారు.

55
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్ళే

ముకేశ్ , త్రిగున్, అమన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. రామ్ ప్రసాద్, నరేష్ లకు ఎంటర్టైన్మెంట్ లో మంచి మార్కులు పడుతున్నాయి. దేబ్జానీ ఫీమేల్ కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ గా ఉంది. మరి వీరిలో టైటిల్ ఎవరు అందుకుంటారో మరికొన్ని వారాల్లో తేలిపోనుంది,

Read more Photos on
click me!

Recommended Stories