అవి మర్చిపోలేకపోతున్న రష్మిక మందన్నా, అభిమానులతో అరుదైన ఫోటోలు పంచుకుంటూ ఎమోషనల్‌

First Published | Nov 16, 2024, 6:20 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇంకా ఆ విషయాలను మర్చిపోలేకపోతుంది. లేటెస్ట్ గా ఆమె అరుదైన ఫోటోలను పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. 

రష్మిక మందన్నా త్వరలో `పుష్ప 2`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్‌. ఎవరికి వాళ్లు `పుష్ప2`కి సంబంధించిన అప్‌ డేట్స్ ఇస్తున్నారు. ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని, మార్కెట్‌లో బజ్‌ని క్రియేట్‌ చేస్తున్నారు. అందులో భాగంగా  రష్మిక మందన్నా ‘పుష్ప 1’ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు పంచుకోని అరుదైన ఫోటోలను బయటపెట్టారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సంవత్సరాల క్రితం జరిగిన ‘పుష్ప’ చిత్రం మొదటి భాగం షూటింగ్, మేకప్, సెట్, పాట చిత్రీకరణ వీడియో, కోస్టార్స్, డాన్సర్లతో దిగిన ఫోటోలు, తన దుస్తులు,  అల్లు అర్జున్‌తో ఉన్న ఫోటోలను రష్మిక పంచుకున్నారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రష్మిక పేర్కొంటూ త్వరలో `పుష్ప 2` ట్రైలర్‌ రాబోతుంది. ఈ క్రమంలో ఈ పాత జ్ఞాపకాలను చూసుకోవడం ఆనందంగాఉంది అని తెలిపింది రష్మిక. 


మొదటి రోజే రూ.270 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం: నటుడు అల్లు అర్జున్, నటి రష్మిక మందన్న నటించిన ‘పుష్ప-2: ది రూల్’ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌ సైతం భారీగానే ఎక్స్ పెక్ట్ చేస్తుంది. `బాహుబలి 2`, `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లని బ్రేక్‌ చేయాలని టీమ్‌ భావిస్తుందట. 

మొదటి రోజు భారతదేశంలో రూ.200 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు, మొత్తం రూ.270 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. ఇలా జరిగితే, చిత్రం కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇండియన్‌ బిగ్గెస్ట్ , హైయ్యెస్ట్ కలెక్టెడ్‌ మూవీగా `పుష్ప2` నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏ రేంజ్‌లో ఉంటుందనేది చూడాలి. 

2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ చిత్రానికి సీక్వెల్ ఇది. డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తుండగా, ఇందులో అనసూయ, సునీల్‌, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫా\జిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. మొదటి పార్ట్ లో సమంత ఐటెమ్‌ నెంబర్‌ చేయగా, ఇందులో శ్రీలీల నర్తించడం విశేషం. మరి ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా అనేది చూడాలి. 

read more:హీరోయిన్లతో అల్లు అర్జున్ లవ్ ఎఫైర్స్, అల్లు స్నేహకి మొత్తం తెలుసు.. అయినా పెళ్ళెందుకు చేసుకుందంటే

Also read: అమ్మకి విషయం తెలియడంతో భయపడి ముంబయి ట్రైన్‌ ఎక్కి పారిపోయిన రవితేజ, మంటలు చెలరేగడంతో మర్చిపోలేని ఘటన

Latest Videos

click me!