పెళ్ళికి ముందే నా భర్తతో వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని..అత్తగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్స్ 

First Published | Nov 16, 2024, 5:59 PM IST

సమీరారెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో నటించింది. 

సమీరారెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఎన్టీఆర్, సమీరా మధ్య సంథింగ్ సంథింగ్ జరిగినట్లు రూమర్స్ కూడా ఉన్నాయి. చిరంజీవితో జై చిరంజీవా చిత్రంలో కూడా సమీరా రెడ్డి నటించింది. కొన్నాళ్ళకు ఇండస్ట్రీకి దూరం అయింది. 

sameera reddy

ఆ తర్వాత సమీరా రెడ్డి ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళికి ముందు తన భర్తతో ప్రేమ సంగతులని సమీరా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. పెళ్ళికి ముందు అక్షయ్, సమీరా కొంత కాలం డేటింగ్ చేశారట. మేమిద్దరం డేటింగ్ కి వెళితే అక్షయ్ వాళ్ళ అమ్మని కూడా తీసుకువచ్చేవాడు. అమ్మ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. 


ఆమెని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మనమే తీసుకెళ్లాలి అని చెప్పాడు. ఇద్దరం సినిమాకి వెళితే ఆమెని కూడా తీసుకువచ్చేవాడు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కొన్నిసార్లు లేట్ అయితే రాత్రి వేళల్లో అక్షయ్ ఇంట్లోనే నిద్ర పోయేదాన్ని. వాళ్ళ అమ్మ పెళ్ళికి ముందే అక్షయ్ తో నన్ను ఉండనిచ్చేది. అప్పటి నుంచి మా అత్తగారు నాకు సపోర్ట్ గా ఉంటున్నారు అని సమీరా రెడ్డి తెలిపింది. 

సమీరా రెడ్డి తన భర్త అక్షయ్ కంటే వయసులో రెండేళ్లు పెద్దది. బాలీవుడ్ లో ఇప్పుడు వయసు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోయిన్లు తమకంటే 20 ఏళ్ళు చిన్నవారితో కూడా డేటింగ్ చేస్తున్నారు. సమీరా, అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. 

Latest Videos

click me!