విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఓ పాడ్‌కాస్ట్‌లో తమ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకోవడంపై విజయ్ ఆలోచనలు ఎలా ఉంటాయో రష్మిక బయటపెట్టింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ అప్‌కమింగ్ మూవీ 'రణబాలి' ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా పెళ్లైన ఈ జంట సినిమా ప్రమోషన్స్ కోసం కలిసి తిరుగుతుండటంతో.. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మాటలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
సుధీర్ శ్రీనివాసన్ హోస్ట్ చేసిన ఓ పాడ్‌కాస్ట్‌లో విజయ్, రష్మిక రీసెంట్‌గా పాల్గొన్నారు. ఇందులో తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన చాలా విషయాలను వాళ్లు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా యానివర్సరీ, మంత్‌వర్సరీ లాంటి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకునే విషయంలో ఇద్దరి ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో రష్మిక చెప్పుకొచ్చింది.
25
స్పెషల్ డేస్ అంటే విజయ్‌కి ఇష్టముండదా?
ప్రతి చిన్న స్పెషల్ డేను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకునే రకం విజయ్ కాదని రష్మిక చెప్పింది. అలాంటి రోజులకు తను పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడట. ప్రతి నెలా లేదా ప్రతి అకేషన్‌ను గ్రాండ్‌గా జరుపుకోవడం విజయ్‌కి అస్సలు ఇష్టం ఉండదని ఆమె అంది. అయితే రష్మిక గురించి మాట్లాడేటప్పుడు విజయ్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం అందరి దృష్టినీ లాగేసింది. "నా జీవితంలోకి సెలబ్రేషన్‌ను తీసుకొచ్చింది తనే" అని విజయ్ అన్నాడు.
35
'తను హిస్టరీ, లాజిక్, సైన్స్ మనిషి'
విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి కూడా రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "విజయ్ ఒక హిస్టరీ, లాజిక్, సైన్స్ మనిషి. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తనలో ఉంటుంది" అని రష్మిక వివరించింది. దానికి పూర్తి ఆపోజిట్‌గా తన క్యారెక్టర్ ఉంటుందని, తాను ఒక 'ఎమో గర్ల్' (ఎమోషనల్) అని చెప్పుకొచ్చింది.
తన కెరీర్‌లో ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా రష్మిక ఓపెన్ అయింది. తానొక మంచి నటిని కాదంటూ కొందరు విమర్శించారని ఆమె గుర్తుచేసుకుంది. అయితే ఒక నటుడి పర్ఫార్మెన్స్ అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. యాక్టర్స్ ఎప్పుడూ డైరెక్టర్ల మీదే ఆధారపడతారని రష్మిక స్పష్టం చేసింది. ఒక క్యారెక్టర్‌ను ఎలా రాశారు, దాన్ని డైరెక్టర్ ఆడియన్స్ ముందుకు ఎలా ప్రెజెంట్ చేశారు అనేదే నటీనటుల పర్ఫార్మెన్స్‌ను డిసైడ్ చేస్తుందని ఆమె వివరించింది.
55
'డియర్ కామ్రేడ్'ను గుర్తుచేసుకున్న రష్మిక
విజయ్ దేవరకొండతో తను చేసిన రెండో సినిమా 'డియర్ కామ్రేడ్' గురించి కూడా రష్మిక ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. రిలీజ్ టైమ్‌లో ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. ఇప్పటికీ ఆ సినిమాకు, అందులోని క్యారెక్టర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ఆమె అంది. ముఖ్యంగా ఆ సినిమాలో తను చేసిన 'లిల్లీ' క్యారెక్టర్‌ను ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదని చెప్పింది. ఇప్పటికీ బయట జనాలు తనను 'లిల్లీ' అని పిలుస్తుంటారని, అది తనకు చాలా పెద్ద విషయమని రష్మిక మురిసిపోయింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న 'రణబాలి' సినిమాపై ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట కలిసి సందడి చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీళ్లిద్దరూ ఓపెన్‌గా మాట్లాడుకోవడం, పర్సనల్ విషయాలు పంచుకోవడం ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది.