
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు హిట్ అయితే రెండు ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. సరికొత్త లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఆమెకి జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ వారం రాబోతున్న చిత్రాల్లో ఈ సినిమాపైనే అందరి చూపు ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ఇప్పటి వరకు తెలుగులో నలుగురు బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసింది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నానిలతో నటించింది. విజయ్, బన్నీ, మహేష్‌లతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. తమిళంలో విజయ్, ధనుష్, కార్తి వంటి వారితో జోడీ కట్టింది. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా వంటి హీరోలతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌పై కన్నేసింది రష్మిక. తన మనసులో కోరికని బయటపెట్టింది.
ఇప్పుడు రష్మిక మందన్నా టార్గెట్ ప్రభాస్. ఆయనతో పనిచేయాలని ఈగర్‌గా వెయిట్ చేస్తుందట. తన ఆసక్తిని ప్రభాస్ నోటీస్ చేస్తారని, తనకు ఆయన టీమ్ నుంచి త్వరలోనే పిలుపు వస్తుందని, త్వరలో ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది రష్మి. తాజాగా ఆమె `ది గర్ల్ ఫ్రెండ్` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే ఈ విషయం ప్రభాస్ వరకు వెళ్తుందా? ఆయన రష్మికకి ఆఫర్ చేస్తారా? అనేది చూడాలి. కానీ `స్పిరిట్` మూవీ నుంచి దీపిక తప్పుకున్న తర్వాత ముందుగా రష్మికనే అనుకున్నారు. ఆ తర్వాత డిమ్రీ తృప్తిని ఫైనల్ చేశారు.
రష్మిక మందన్నా నటిస్తున్న `ది గర్ల్ ఫ్రెండ్` మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి ఈ ఏడాదిని ముగించాలని భావిస్తోంది. ఇది ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుందని, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయని, టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఎలిమెంట్ మా మూవీలో చూస్తారని ఈ మూవీ గురించి హీరో దీక్షిత్ శెట్టి తెలిపారు. ఇందులో హీరోయిన్ పాత్రని రష్మిక మందన్నా తప్ప మరెవ్వరూ చేయలేరని తెలిపారు దీక్షిత్. ఈ సినిమాతో రష్మిక కుర్రాళ్లకి మరింత దగ్గరవుతుందన్నారు. ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయినా సెట్‌లో చాలా డౌన్ టూ ఎర్త్ ఉండేదని, ఫ్రెండ్లీగా ఉంటుందని, అది ఆమె గొప్ప లక్షణం అని నేషనల్ క్రష్‌పై ప్రశంసలు కురిపించడం విశేషం.
ఇక నేషనల్ క్రష్ `ది గర్ల్ ఫ్రెండ్`తోపాటు ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల తర్వాత మూడోసారి విజయ్, రష్మిక కలిసి చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్, రష్మిక చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల దసరా పండగ సందర్భంగా రహస్యంగా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట.