అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన `పుష్ప 2` సినిమా ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 4న ప్రీమియర్స్ ప్రదర్శించారు. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోని అభిమానుల మధ్య చూసేందుకు వెళ్లారు అల్లు అర్జున్, రష్మిక. కానీ అక్కడకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పరిస్థితి కంట్రోల్ తప్పింది. తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఓ మహిళ(రేవతి) కన్నుమూసింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైంది. మృతురాలు భర్త భాస్కర్ కేసు పెట్టిన నేపథ్యంలో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్‌ని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్ట్ ఆయనకు రిమాండ్ విధించింది.