నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, రష్మిక మందన్న పని గంటలపై ఎలాంటి పరిమితులు విధించలేదని, అవసరం ఉన్నప్పుడల్లా సెట్స్‌లో అందుబాటులో ఉండేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు మరో హీరోయిన్ కి కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, దానిపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్) రష్మిక పనితీరు, కష్టపడి పనిచేసిన తత్వం గురించి ప్రశంసల వర్షం కురిపించారు.
25
రష్మికకి వర్క్ విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎస్కేఎన్ మాట్లాడుతూ..“రష్మిక ఎప్పుడూ షూటింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి పరిమితులు పెట్టలేదు. వర్కింగ్ అవర్స్ పై షరతులు విధించని ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మికనే. అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ అందుబాటులో ఉండేది. నిర్ణయించిన సమయానికి మించి కూడా పనిచేసేది, కానీ ఒక్కసారి కూడా అలసిపోయానని చెప్పలేదు” అని తెలిపారు.
35
ఆకట్టుకున్న రష్మిక
సహజ నటననిర్మాత వ్యాఖ్యలతో పాటు ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. నవంబర్ 7, 2025న విడుదల కానున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇటీవల కాలంలో రిలేషన్ షిప్స్ ఎంత విషపూరితంగా మారుతున్నాయి అనే అంశాన్ని రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ట్రైలర్‌లో రష్మిక చూపిన సహజ, భావోద్వేగపూరిత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమెతో పాటు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే రావు రమేష్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే రష్మికపై ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
55
ఎస్‌కేఎన్ కౌంటర్ ఆమె పైనేనా
వర్కింగ్ అవర్స్ విషయంలో కండిషన్స్ పెట్టని ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక అని ఆయన అన్నారు. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు దీపికా పదుకొనెకి కౌంటర్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల దీపికా 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తాననే కండిషన్ పెట్టడం వల్ల స్పిరిట్, కల్కి 2 చిత్రాలని కోల్పోయింది.