మరోసారి కలిసి రచ్చ చేయబోతున్న పుష్పరాజ్‌, శ్రీవల్లి.. ఏ సినిమాలోనో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Published : Jul 12, 2025, 06:06 PM IST

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా కలిసి `పుష్ప`, `పుష్ప 2`లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. 

PREV
15
మరోసారి కలిసి నటించబోతున్న అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా కలిసి `పుష్ప` చిత్రాల్లో నటించారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో రష్మిక మందన్నాపేరు వినిపిస్తుంది. 

25
ఆ ముగ్గురు హీరోయిన్లతోపాటు రష్మిక కూడా

ఈ సినిమాలో బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, వీరితో పాటు సౌత్ నటి రష్మిక మందన్న కూడా చేరారు. ఆమె కూడా హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. 

35
హీరోయిన్ల పాత్రల నిడివిపై చర్చలు

ఒకే సినిమాలో నలుగురు నటిస్తుండటంతో, ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, ఎవరి పాత్ర వ్యవధి ఎంత అనే లెక్కలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇందులో మరో హీరోయిన్‌ కూడా కనిపించబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. 

45
లాస్‌ ఎంజెల్స్ లో టెస్ట్ షూట్‌లో రష్మిక

లాస్ ఏంజలీస్‌లో ఈ సినిమా కోసం రష్మిక మందన్న లుక్ టెస్ట్, బాడీ స్కాన్ చేయించుకున్నారు. అట్లీ రష్మిక మందన్న పాత్ర కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు.

55
అల్లు అర్జున్‌, రష్మికకి మంచి క్రేజ్‌

పుష్పరాజ్‌- శ్రీవల్లిగా `పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంట ఇప్పటికే టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరి కాంబినేషన్‌కి మంచిక్రేజ్‌ ఉంది. అదే ఇప్పుడు అట్లీ మూవీకి కలిసి రాబోతుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories