లెహంగా వోణీలో అందాలు ఆరబోసిన రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ అని ఊరికే అనలే.. మతిపోగొడుతున్న శ్రీవల్లి..

Published : Sep 06, 2022, 03:20 PM ISTUpdated : Sep 06, 2022, 09:33 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా లెహంగా వోణీలో అందాల విందు చేసింది. తను నటించిన ‘గుడ్ బై’ హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి మతిపోగొట్టింది.  

PREV
19
లెహంగా వోణీలో అందాలు ఆరబోసిన రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ అని ఊరికే అనలే.. మతిపోగొడుతున్న శ్రీవల్లి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను నటించిన తొలి హిందీ ఫిల్మ్ ‘గుడ్ బై’ (Good Bye) రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

29

ఈ సందర్భంగా  చిత్ర యూనిట్  జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ‘గుడ్ బై’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు యూనిట్ మొత్తం హాజరైంది. హీరోయిన్ రష్మిక మందన్న, నేనా గుప్తా, దర్శకుడు వికాస్ బహ్ల్, నటీనటులు వచ్చారు.

39

ఈవెంట్ లో రష్మిక మందన్న ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ట్రెడిషనల్  వేర్ లో స్టార్ హీరోయిన్ అందరి చూపును తనవైపే తిప్పుకుంది. ప్రింటెడ్ లెహంగా, వోణీ ధరించిన రష్మిక నాజుకూ అందాలను విందు చేసింది. తన ప్రజెన్స్ తో ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా కొనసాగింది. 
 

49

ట్రైలర్ లాంచ్ సందర్భంగా రష్మిక మందన్నను కలిసేందుకు తన అభిమానులు అక్కడి చేరుకున్నారు. వారితో రష్మిక సరదాగా మాట్లాడటమే కాకుండా, సెల్ఫీలు కూడా ఇచ్చింది. అభిమాన హీరోయిన్ ను దగ్గర్నుంచి చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 
 

59

రష్మిక అదిరిపోయే అవుట్ ఫిట్ అందరినీ ఆకట్టుకుంది. ఎత్నిక్ కో-ఆర్డ్ సెట్‌లో మెరిసిపోయింది. అలాగే గ్లామర్ విందు కూడా చేసింది. నడుము, ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు మైమరిచిపోతున్నారు. 
 

69

హిందీలో తను నటించిన తొలిచిత్రం ‘గుడ్ బై’ కావడంతో నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు రష్మిక ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో పాటు ప్రమోషన్స్ లోనూ పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 
 

79

తాజాగా రిలీజ్ అయిన ‘గుడ్ బై ట్రైలర్’ (Good Bye)కు కూడా ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. తండ్రీకూతురిగా ఆకట్టుకుంటున్నారు. చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

89

అదేవిధంగా హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. మరోవైపు తెలుగులో ‘పుష్ప : ది రూల్’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.  

99

ఇలా రష్మిక వరుస చిత్రాల్లో నటిస్తూ అటు సౌత్, ఇటు నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ‘గుడ్ బై’ ఇచ్చే ఫలితం బాలీవుడ్ లో రష్మికను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు భారీ చిత్రాలు కూడా రష్మిక చేతిలో ఉండటంతో ఎలాగైనా అక్కడ జెండా పాతేస్తుందంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories