ఆన్‌లైన్ షాపింగ్ యాప్ మీషో సరికొత్త యాడ్‌కి తెరలేపింది. సౌత్, నార్త్ సినీ తారలు, క్రికెట్ సెలబ్రిటీలతో ఓ బిగ్గెస్ట్ యాడ్ చేసింది. `మెగా బ్లాక్ బస్టర్` అంటూ పోస్టర్ ప్రకటించింది. ఇందులో ఎవరికి వారు పేర్లని స్టారింగ్‌గా వేయడం విశేషం. దీంతో అందరూ ఆశ్చర్యాపోయారు. ఇందులో రామ్‌చరణ్, రష్మిక మందన్నాతోపాటు కార్తి, త్రిష, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె, అలాగే క్రికెటర్లు రోహిత్ వర్మ, గంగూలీ సైతం ఉండటం నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యింది. వీరంతా కలిసి సినిమా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తీరా చూస్తే అది యాడ్ కావడం విశేషం.