Rashmika Mandanna: మరోసారి నోటి దురుసు చూపించిన రష్మిక... సౌత్ చిత్రాలను అవమానిస్తూ దారుణ వ్యాఖ్యలు!

First Published Dec 29, 2022, 10:31 AM IST


స్టార్ హీరోయిన్ రష్మిక మందాన మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆమె సౌత్ చిత్ర పరిశ్రమను కించపరిచారు. 
 

Rashmika Mandanna

రేవు దాటగానే తెప్ప తగలేసినట్లు... సౌత్ చిత్రాలతో స్టార్ గా ఎదిగిన రష్మిక మందాన, అదే పరిశ్రమను కించ పరిచేలా మాట్లాడారు. ఆమె లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను ప్రమోషనల్ ఈవెంట్లో రష్మిక అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో బాలీవుడ్ తో సౌత్ ఇండస్ట్రీని పోల్చుతూ తక్కువ చేసి మాట్లాడారు.


రష్మిక(Rashmika Mandanna) మాట్లాడుతూ... రొమాంటిక్ సాంగ్స్ అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి నేను బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది నా కెరీర్ లో బెస్ట్ రొమాంటిక్ సాంగ్ అని... మిషన్ మజ్ను మూవీలో సాంగ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. 

అసలు శ్రావ్యమైన సంగీతం అంటే ఏమిటో సౌత్ ఇండియా ప్రేక్షకులకు తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్స్ వినసొంపైన సంగీతం ఇవ్వలేరు అన్నట్లు రష్మిక వ్యాఖ్యలు ఉన్నాయి. సౌత్ సినిమా మ్యూజిక్ ని ఆమె డప్పుల సౌండ్స్ తో కూడిన రొట్ట అన్న అర్థంలో మాట్లాడారు. ఆమెకు బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టం అయితే... వారిని పొగడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ పేరుతో సౌత్ మ్యూజిక్ ని దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. 


రొమాంటిక్ సాంగ్స్ అంటే రష్మిక దృష్టిలో ఏమిటో ఆమెనే చెప్పాలి. ఇళయరాజా స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్స్ రష్మిక బహుశా వినలేదేమో. అంతకు మించిన గొప్ప మెలోడీలు, రొమాంటిక్ సాంగ్స్ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో  ఆమె చెప్పాలి. 


ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ పరిస్థితి ఏమిటీ? సౌత్ చిత్రాలకు ఆయన కంపోజ్ చేసిన రొమాంటిక్ సాంగ్స్ రష్మిక మర్చిపోయారా?. రోజా, ముంబాయి, ప్రేమదేశం, ప్రేమికులరోజు, సఖి ఇలా పలు చిత్రాలకు ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన సాంగ్స్ లో రొమాన్స్ లేదా? అవి అద్భుతమైన రొమాంటిక్ సాంగ్స్ కావా?. 
 


సాంప్రదాయ సంగీతానికి పుట్టినిల్లు సౌత్ ఇండియా. ఎం ఎస్ సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి లెజెండ్స్ పుట్టింది సౌత్ ఇండియాలోనే. చరిత్ర పుటల్లోకి వెళితే లోతైన సంగీత మూలాల సౌత్ ఇండియాలో ఉన్నాయి. మిడిమిడి జ్ఞానంతో రష్మిక సౌత్ మ్యూజిక్ ని డప్పుల గందరగోళం, మాస్ మసాలా ఐటెం నంబర్స్ మాత్రమే అని స్టేట్మెంట్ ఇవ్వడం, క్షమించరాని నేరమే. 
 


రష్మిక కామెంట్స్ పెద్ద దుమారం లేపుతున్నాయి. ఆమెను సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. క్షమాపణలు చెప్పి తన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఈ మధ్య కాలంలో రష్మికకు వివాదాలు పరిపాటి అయ్యాయి. రష్మిక పొగరుతో కూడిన కామెంట్స్ కన్నడిగులు మనోభావాలు దెబ్బతీశాయి. ఆమెను బ్యాన్ చేసే ఆలోచన కూడా చేశారు. కన్నడ భాషపై, కాంతార చిత్రంపై ఆమె స్టేట్మెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. స్టార్డం వచ్చాక ఆమెకు సక్సెస్ కిక్ ఎక్కినట్లు ఉంది. నోటికి వచ్చింది మాట్లాడుతూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. 

click me!