ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు కూడా ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించి ఈబ్యూటీ.. బాలీవుడ్ లో కూడా తన ప్రతాపంచూపించాలని తెగ హడావిడి చేస్తోంది.
అప్పటి వరకూ క్లాస్ ఆడియన్స్ లో మాత్రమకాస్త ఇమేజ్ ఉన్న రష్మికకు.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర మాస్ ఫ్యాన్ బేస్ ను కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలో తన డిమాండ్ కాస్ ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో.. రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందట బ్యూటీ.
మొన్నటి వరకూ మూడు కోట్లు.. నాలుగు కోట్లు.. మూడున్నర కోట్లూ అంటూ తీసుకుంటూ వచ్చిన ఈమ్యూటీ.. ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకుని.. అచ్చంగా ఐదు కోట్లు ఇవ్వాఅంటూ అడిగేస్తుందట. సినిమాకు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారి సినిమాలే చేస్తానంటుందంట.
Image: Rashmika MandannaInstagram
అంతే కాదు పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు కూడా సై అంటోందిట రష్మిక. దీనికి కూడా కళ్లు చెదిరు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రష్మకను అడిగారట టీమ్. అయితే ఆమె మాత్రం ఈ సాంగ్ కోసం 2 కోట్లు పైనే డిమాండ్ చేసిన్టు..బయట నుంచి తెలుస్తున్న సమాచారం.
Rashmika Mandanna
ఇటు సౌత్ తో పాటు.. అటు బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించాలి అనుకుంటుుంది బ్యూటీ. హిందీలో మూడు సినిమాల వరకూ తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 కోసం ప్రిపేయిర్ అవుతుంది. ఇక బన్నీతో పాటు సుకుమార్ టీమ్ ప్రస్తుతం పుష్ప రష్యన్ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. రష్యాలో ఈమూవీ రిలీజ్ అయిన తరువాత.. పుషో్ప పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.