సమంత మహానటి... నాగ చైతన్య మేనమామ సురేష్ బాబు కామెంట్స్ వైరల్!

First Published Dec 3, 2022, 12:24 PM IST


అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న నిర్మాత సురేష్ బాబు సమంతపై ఒక కామెంట్ చేశారు. ఆమెను ఈ తరం మహానటిగా అభివర్ణించాడు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Samantha

నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో  విడిపోతున్నట్లు వెల్లడించారు. వీరి విడాకులపై నాగ చైతన్య ఫ్యామిలీ స్పందించింది చాలా తక్కువ. నాగార్జున మాత్రం సమంత మంచి అమ్మాయి. విడాకులు దురదృష్టకరం అన్నారు. 
 

Samantha

నాగ చైతన్య పూర్తిగా సైలెంట్. కనీసం ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా ఆయన చేయలేదు. జస్ట్ విడాకుల తీసుకుంటున్నట్లు ఒక నోట్ షేర్ చేశారంతే. మరోవైపు సమంత మాత్రం తన అసహనం వెళ్లగక్కింది. ఇంటర్వ్యూల్లో ఆవేశపూరిత కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ పోస్ట్స్ పెడుతూ ఉంటారు.

Samantha


నాగ చైతన్య అమ్మ తరపువారైన దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. బావ రానాతో పాటు మేనమామలు వెంకటేష్, సురేష్ బాబు మౌనంగా ఉన్నారు. వారికి సమంతపై ఎలాంటి అభిప్రాయం ఉందనేది ఒకింత సస్పెన్స్ అని చెప్పాలి. రానా వివాహంలో సమంత అన్నీ తానై వ్యవహరించారు. ఆ వేడుక కోసం ఖరీదైన డిజైనర్స్ వేర్స్ ధరించి వేడుకలో సందడి చేశారు. 

Samantha

తాజాగా సురేష్ బాబు చేసిన కామెంట్స్ సమంత పట్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఒపీనియన్ తెలియజేసింది. సురేష్ బాబు, అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. హోస్ట్ బాలకృష్ణ టాస్క్ లో భాగంగా... ఈ తరం మహానటి ఎవరో చెప్పాలని ఇద్దరినీ అడిగారు. ఈ ప్రశ్నకు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఒకే అభిప్రాయం వెల్లడించారు. ఆ ఛాన్స్ ఒక్క సమంతకు మాత్రమే ఉందన్నారు. 
 

Samantha


సురేష్ బాబు మాట్లాడుతూ... ఈ జనరేషన్ లో మహానటి సావిత్రి అంతటి ఫేమ్ సమంత తెచ్చుకునే అవకాశం కలదు. ఆమెకు ఆ అర్హత ఉందని చెప్పుకొచ్చారు. లెజెండ్ సావిత్రితో పోల్చడం అంటే చిన్న ప్రశంస కాదు. మూడు నాలుగు తరాల హీరోయిన్స్ ని చూసిన సురేష్ బాబు ఆ గౌరవానికి సమంతను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Samantha

అదే సమయంలో నాగ చైతన్యకు సమంత దూరమైనందుకు ఆమెపై దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి కోపం లేదని తేలిపోయింది. చైతూ వాళ్ళ మేనల్లుడు అయినప్పటికీ విడాకులు వారిద్దరి వ్యక్తిగత సమస్య, నిర్ణయం. కాబట్టి ఎవరినీ తప్పుబట్టకూడదని సురేష్ బాబు ఉన్నతంగా ఆలోచించారనిపిస్తుంది.

click me!