రష్మిక మందన్నాకి కలిసొచ్చిన డిసెంబర్‌ సెంటిమెంట్‌.. ఈ సారి హ్యాట్రిక్‌ కొడుతుందా? ఆశలన్నీ ఐకాన్‌ స్టార్‌పైనే

First Published Jul 6, 2024, 5:25 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా డిసెంబర్‌ సెంటిమెంట్‌ బాగా కలిసొస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నిరూపితమైంది. మరి మూడో సారి హ్యాట్రిక్‌ కొడుతుందా?
 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఉంది. నెమ్మదిగా బాలీవుడ్‌లోనూ పాగా వేస్తూ ఇండియన్‌ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారబోతుంది. సైలెంట్‌గా ఇండియన్‌ సినిమాని ఊపేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మిక ఇప్పుడు అత్యధిక ప్రాజెక్ట్ లతో ఫుల్‌ బిజీగా ఉంది. 
 

ఆమె చేతిలో  పాన్‌ ఇండియా మూవీ `పుష్ప 2`, `కుబేర`, అలాగే `ది గర్ల్‌ ఫ్రెండ్‌`, `రెయిన్‌బో` చిత్రాలున్నాయి. మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖానతో `సికందర్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఛావా` అనే బాలీవుడ్‌ మూవీ కూడా చేస్తుంది. ఇవే కాకుండా చర్చల దశలో మరో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయట. అందులో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ కూడా ఉంది. 

Latest Videos


ఇలా బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. ఓ సెంటిమెంట్‌ని మాత్రం బలంగా నమ్ముతుంది. ఆమెకది సక్సెస్‌ సెంటిమెంట్ గా మారింది. దీంతో ఇప్పటికే రెండు సార్లు హిట్‌ కొట్టింది. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీ అవుతుంది.  హ్యాట్రిక్‌ మాత్రమే కాదు, ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేయడానికి రెడీ అవుతుంది. మరి ఆ సెంటిమెంట్‌ ఏంటి? హ్యాట్రిక్‌ స్టోరీ ఏంటనేది చూస్తే, 
 

రష్మిక మందన్నాకి డిసెంబర్‌ నెల బాగా కలిసి వచ్చింది. ఆమె మూడేళ్ల క్రితం `పుష్ప`సినిమాతో వచ్చింది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ మూవీకి సుకుమార్‌ దర్శకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌ డ్రాప్ లో మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కింది. డిసెంబర్‌ 17న విడుదలై ఊహించని విజయాన్ని సాధించింది. కరోనా ప్రభావం, టికెట్ల రేట్ల హైక్ లేకపోయినా, కలెక్షన్ల దుమ్ము దులిపింది. సుమారు రూ.350కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతోనే రష్మిక మందన్నా ఇండియా వైడ్‌గా తెలిసింది. ఆమెకి పాన్‌ ఇండియా ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. 
 

ఆ తర్వాత గతేడాది `యానిమల్‌` సినిమాతో డిసెంబర్‌లో(డిసెంబర్‌ 1న విడుదల) వచ్చింధీ నేషనల్‌ క్రష్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్‌ మూవీ అనూహ్య విజయాన్ని సాధించింది. సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలుచేసింది ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. దీనిపై అనేక విమర్శలు వచ్చినా, థియేటర్లలో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.ఇందులో రష్మిక మందన్నా సైతం కాస్త బోల్డ్ గానే కనిపించడం విశేషం. 
 

ఇలా డిసెంబర్ లో ఇప్పటికే రెండు పాన్‌ ఇండియా హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకుంది రష్మిక మందన్నా. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతుంది. ఆమె నటిస్తున్న `పుష్ప 2` సైతం డిసెంబర్‌లోనే రాబోతుంది. ఈ సినిమాని డిసెంబర్‌ న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో మరోసారి శ్రీవల్లిగా కనువిందు చేయబోతుంది రష్మిక. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. టీజర్‌ కూడా దుమ్మురేపేలా ఉంది. దీంతో `పుష్ప 2`పై అందరిలోనూ అంచనాలున్నాయి. బాక్సాఫీసుకి చుక్కలు చూపించే సినిమా రాబోతుందని అంటున్నారు. 
 

మరి ఈ చిత్రంతో రష్మికకి డిసెంబర్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? హ్యాట్రిక్‌ కొడుతుందా అనేది చూడాల్సి ఉంది. ఆశలన్నీ, సుకుమార్‌, అల్లు అర్జున్‌లపైనే ఉంది. వాళ్లు ఏం చేస్తారనేది చూడాలి. హిట్‌ కొడితే మాత్రం రష్మిక మందన్నా డిసెంబర్‌ని తన నెలగా ప్రకటించుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం జరుగుతుందో చూడాలి. 
 

click me!