వైయస్ జగన్ ఫెయిల్యూర్ పై నాగ్ అశ్విన్ ఎంత హిలేరియస్ గా స్పందించారంటే..

First Published Jul 6, 2024, 5:10 PM IST

.వైయస్ జగన్ ఓడిపోకపోయి ఉంటే, కూటమి గెలవకపోయి ఉంటే అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..

Naga ashwin, Ys Jagan


ఇంతకు ముందు సినిమా వాళ్లు ఓపెన్ గా మీడియా ఇంటరాక్షన్ లలో రాజకీయాలు ప్రస్తావన రావటానికి ఇష్టపడేవారు కాదు. అలాగే డైరక్ట్ కామెంట్స్ ఎప్పుడూ ఉండేవి కాదు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ తమ మనస్సులో అభిప్రాయాలు చెప్తోంది. తాము ఎవరికి సపోర్ట్ అనేది డైరక్ట్ గా ప్రస్తావిస్తోంది. ఇక కల్కి చిత్రం నిర్మాత అశ్వనీదత్ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీనే. చంద్రబాబు విజయం కోరుకుంటూనే వచ్చారు. ఆయన ఎలక్షన్స్ ముందు అదే చెప్పారు. గెలిచాకే అదే విషయం ఓపెన్ గా ప్రస్తావించారు. ఇక తాజాగా నాగ్ అశ్విన్ కు ఇదే విషయమై మీడియా ఇంటరాక్షన్ లో ఓ ప్రశ్న ఎదురైంది. 

Kalki 2898 AD


ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  ఎక్కడ విన్నా కల్కి విషయాల ప్రస్తావనే. ఇప్పటికే  దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  ఈ క్రమంలో సెకండ్ వీకెండ్ లోకి ప్రవేశిస్తున్న టైమ్ లో సినిమా ప్రమోషన్స్ పెంచారు.  డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

Latest Videos


Kalki 2898 AD


అందులో ఓ ప్రశ్న...వైయస్ జగన్ ఓడిపోకపోయి ఉంటే, కూటమి గెలవకపోయి ఉంటే అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..దీనిపై మీ స్పందన ఏమిటి అంటే ...నాగ్ అశ్విన్ ...అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఆయన తన మామగారు అశ్వ నీదత్ లాగే తెలుగుదేశం, కూటమని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసినట్లు అయ్యింది. అదే ప్రశ్న గతంలో వేరే డైరక్టర్స్ కు ఎదురైతే సమాధానం క్లారిటీ లేకుండా చెప్పేవారు. కానీ నాగ్ అశ్విన్ అలాలేకుండా వైయస్ జగన్ పార్టీ ఓడిపోవటం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేసారు. 
 

Kalki 2898 AD

మరో ప్రశ్నలో కల్కి చిత్రం పార్ట్-2లో మహేశ్ బాబు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు? దీనిపై మీరేమంటారు? అని నాగ్‌ అశ్విన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'ఇప్పుడైతే మేం మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోలేదు.. ఈ సినిమాలో కాకుండా.. వేరే ఏదైనా చిత్రంలో ఆయన చేస్తే బాగుంటుంది' అని అన్నారు. 
 

Kalki 2898 AD


అంతే కాకుండా హీరో నాని, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ.. వాళ్లద్దరిని తీసుకోవడం ఈ చిత్రంలో కుదరలేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే వాళ్లను అక్కడ పెట్టేస్తాను' అని అన్నారు. 

అలాగే కల్కి విషయంలో  తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని నాగ్ అశ్విన్ ఒప్పుకొన్నాడు.  'కల్కి'లో మేజర్ కంప్లైంట్స్ విషయానికొస్తే ఫస్టాప్ ల్యాగ్ అయిపోయింది. అయితే సినిమాని రెండు పార్ట్స్‌గా తీయాలనే ఉద్దేశంతో పాటు కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నామని నాగ్ అశ‍్విన్ చెప్పాడు. అలానే ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సిందని చెప్పుకొచ్చాడు. 


ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతూ.. కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డీనరీగా వస్తే, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడు.


'మహానటి'లానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో! పట్టి పట్టి చెప్పినట్లు ఉందని తమకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసినవాళ్లు డబ్బింగ్ చెబితే 100 శాతం ఫెర్ఫెక్ట్ ఉంటుందనేది తన అభిప్రాయమని అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు.  
 

Kalki 2898 AD


 ‘‘కల్కి 2898 ఏడీ’ని సూపర్‌ హిట్‌ చేసినందుకు మా టీమ్, వైజయంతీ మూవీస్‌ తరఫున ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం మొత్తం ఇండస్ట్రీదిగా భావిస్తున్నాను. ఎన్నో ప్రోడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్‌ కమింగ్‌ డైరెక్టర్స్‌కి ఒక డోర్‌ ఓపెన్‌ అయ్యింది. ఇలాంటి సైన్స్‌ ఫిక్షన్‌ కథలు రాసుకునే వారికి ‘కల్కి’ రిఫరెన్స్‌ పాయింట్‌లా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అన్నారు.  

Vijay Deverakonda Dulquer Salmaan part of Kalki 2898 AD Second


తెలుగు సినిమా అనగానే చాలామందికి ‘మాయా బజార్‌’ గుర్తొస్తుంది. అది ఓ రకంగా మహాభారతం ఆధారంగా రూపొందిందే. ‘మాయా బజార్‌’ మూవీ స్ఫూర్తితోనే ‘కల్కి 2898 ఏడీ’ తీశాను. ఈ కథను ముందుగా చిరంజీవిగారికి చెప్పాననడంలో నిజం లేదు. ప్రభాస్‌గారు కథని నమ్మి చాలా సపోర్ట్‌ చేశారు. ముందు ఒకే భాగంగా తీయాలనుకున్నాం. కొన్ని షెడ్యూల్స్‌ తర్వాత ఇంత పెద్ద కథని ఒక భాగంలో చెప్పడం సవాల్‌గా అనిపించింది. అందుకే రెండు భాగాలుగా చూపించాలనుకున్నాను. 

Kalki 2898 AD

 ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ చేసిన భైరవ పాత్ర సీరియస్‌గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్‌ చేశాను. మొదటి భాగంలో ప్రభాస్‌ పాత్ర నిడివి తక్కువగా ఉందంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. 
 

Kalki 2898 AD

ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్స్‌ని వ్యాపార కోణంలో ఆలోచించి తీసుకోలేదు. ఆయా పాత్రలకు వారు న్యాయం చేయగలరనే ఉద్దేశంతోనే తీసుకున్నా. ఒకవేళ కథలో బలం లేకపోతే ఆ నటుల ఎంపిక మాకు నెగెటివ్‌ అయ్యేది. కానీ వారి క్యారెక్టర్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. కమల్‌ సార్‌ చేసిన యాస్కిన్‌ పాత్రను పార్ట్‌ 2లోనే ఎక్కువ రివీల్‌ చేస్తాం. 


వైజయంతీ మూవీస్‌ 50 ఏళ్ల జర్నీలోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో ఉన్న అత్యధిక భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ సినిమా గొప్ప విజయం సాధించి మా పెట్టుబడి పూర్తిగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది. రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళిగార్లు ఈ మూవీలో కనిపించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌. 


విజయ్‌ దేవరకొండ, మాళవికా నాయర్‌లతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తీశాను. నా ఫస్ట్‌ మూవీ నటులు కాబట్టి వారు ప్రత్యేకం. నాకు లక్కీ ఛార్మ్‌. అందుకే వాళ్లని నా ప్రతి చిత్రంలో తీసుకుంటాను. నానీ, నవీన్‌ ΄పోలిశెట్టిలను రెండో భాగంలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేస్తా (నవ్వుతూ).  
 

 ‘కల్కి’ రెండో భాగానికి సంబంధించి 20 రోజులు షూటింగ్‌ జరిపాం. రెండో భాగంలో కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తార న్నది సస్పెన్స్‌. రెండో భాగాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేం.
 

click me!