'కాంతారా' వివాదంపై క్లారిటీ ఇస్తూ రష్మిక ఆగ్రహం.. నా పర్సనల్ లైఫ్ కెమెరా పెట్టి మీకు చూపించాలా..

First Published Dec 9, 2022, 9:11 AM IST

రష్మిక తరచుగా వార్తల్లోకెక్కడం, ట్రోలింగ్, వివాదాలు చూస్తూనే ఉన్నాం. రష్మిక కన్నడ అమ్మాయి కాబట్టి అక్కడి మీడియా ఫోకస్ రష్మికపై ఎక్కువే.

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ చిత్రంలో రష్మిక శ్రీవల్లిగా కుర్రకారు హృదయాలు దోచుకుంది. 

అయితే రష్మిక తరచుగా వార్తల్లోకెక్కడం, ట్రోలింగ్, వివాదాలు చూస్తూనే ఉన్నాం. రష్మిక కన్నడ అమ్మాయి కాబట్టి అక్కడి మీడియా ఫోకస్ రష్మికపై ఎక్కువే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాత్మక విజయం సాధించింది. 

15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే ఆ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కంటారా మాటే వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని కర్ణాటకలోని తుళు సంప్రదాయం ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన అద్భుతం. అయితే రష్మిక ఈ చిత్ర వివాదంలో చిక్కకుంది. 

ఈ మూవీ రిలీజైనప్పుడు.. కన్నడ మీడియా ఆమెని కాంతారా చూశారా అని ప్రశ్నించింది. తాను కాంతారా చూడలేదు అని రష్మిక బదులు ఇవ్వడంతో కన్నడ సినీ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రష్మికని బ్యాన్ చేయాలంటూ ట్రోల్ చేశారు. కాంతారా విషయంలో రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే తాజాగా ఈ వివాదంపై స్పందిస్తూ రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కన్నడ చిత్ర పరిశ్రమలో కొందరు నన్ను బ్యాన్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి సత్యం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. అలాంటి విషయాలు నాదగ్గరికి రాలేదు. కన్నడ సినిమాపై ఎప్పటికి నాకు ప్రేమ ఉంటుంది. నాపై దృష్ప్రచారం చేయడం ఆపండి అంటూ ఓ కార్యక్రమంలో రష్మిక స్పందించింది. 

కాంతారా గురించి క్లారిటీ ఇస్తూ.. మూవీ రిలీజైనప్పుడు మీడియా నన్ను ప్రశ్నించారు. అప్పటికి నేనింకా సినిమా చూడలేదు. ఆ తర్వాత మూవీ చూసి చిత్ర యూనిట్ మెసేజ్ ద్వారా కంగ్రాట్స్ తెలిపా. వారు థాంక్యూ అని రిప్లై ఇచ్చారు. ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు. నా సినిమాల వరకు నేను బాధ్యతగా స్పందించాలి. నా పర్సనల్ లైఫ్ ని మీకు కెమెరాలో చూపించాలా అంటూ రష్మిక మండిపడింది. ఏది ఏమైనా కాంతారా వివాదం రష్మిక మెడకు బలంగా చుట్టుకుంది. ఈ క్లారిటీతో అయినా ట్రోలింగ్ ఆపుతారేమో చూడాలి. 

click me!