Guppedantha Manasu: వసుధారపై అనుమాన పడుతున్న రిషి.. వసుని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన జగతి?

First Published Dec 9, 2022, 8:51 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బాధపడుతూ ఉండగా ఇంతలో కాలేజీ స్టాప్ అక్కడికి వచ్చి వసుధార క్షమించమని అడిగి ఎక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ధరణి అక్కడికి వెళ్లి ఏంటి వసుధార ఇక్కడ ఉన్నావు అని అనగా ఏమి లేదు మేడం అనడంతో సరే మినిస్టర్ గారు వస్తున్నారంట రిషి పిలుస్తున్నాడు  వెళ్దాం పద అనడంతో సరే అని అక్కడికి వెళ్తారు. మరొకవైపు మినిస్టర్ రావడంతో రిషి గౌతమ్ వాళ్లు వెళ్లి మినిస్టర్ ని రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మినిస్టర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదా రిషి అనగా కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు సార్ అనడంతో స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా చాలా సంతోషం అందరూ బాగా చదివి మీ రిషి సార్ కి మంచి పేరు తీసుకుని రావాలి అని అంటాడు మినిస్టర్.
 

 ఇంతలోనే వసుధార అక్కడికి రావడంతో ఏమ్మా నువ్వే కనిపించడం లేదని అనుకుంటున్నాను అని అంటాడు మినిస్టర్. అప్పుడు వసుధార డల్ గా ఉండడంతో అది రిషి గమనిస్తాడు. ఇప్పుడు మినిస్టర్ వసుధార నువ్వు అన్నిట్లోనూ ముందు ఉంటావు కదా ఆటపాటలను నువ్వే చూసుకో అనడంతో అలాగే సరే అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార మౌనంగా ఉండడంతో రిషి ఎందుకు అంత డల్ గా కనిపిస్తున్నావు అనగా ఏం లేదు సార్ అంటుంది. అప్పుడు ధరణి వసుధార హుషారుగా ఉండాలి అంటే ఆటపాట మొదలుపెట్టాలి అని అంటుంది. ఆ తర్వాత వసుధార ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు.
 

అప్పుడు వసుధ రా నువ్వు బాధలో ఉన్నావని నాకు తెలుసు కానీ స్టూడెంట్స్ కోసం రుషి కోసం నువ్వు ఆడాలి లేకపోతే రిషి బాధపడతాడు అని వసుకి నచ్చజెప్పి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు గౌతమ్. తర్వాత అందరూ కలిసి తాడు లాగుతూ ఉంటారు. ఒకవైపు ఆడవారు మరొకవైపు మగవారు తాడు లాగే పోటీని ఆడుతూ ఉంటారు. ఆటలో మగవారు గెలుస్తారు అప్పుడు వసుధార కింద పడిపోతూ ఉండగా రిషి వెళ్లి పట్టుకుంటాడు. అప్పుడు వసుధార ఒకరు ఒకరు తగులుకోవడం చూసి కాలేజీ స్టాప్ కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడు వసు, రిషి ఒకరి కళ్ళ లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ధరణి ఇలా బల ప్రదర్శన చేస్తే మగవారే గెలుస్తారు ఇందులో వింత ఏముంది అని అంటుంది.
 

ఇంతలోనే అక్కడికి ఒక అతను వచ్చి భోజనానికి రమ్మని చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ భోజనానికి వెళ్తారు. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటారు. అప్పుడు వసుధార దీనంగా ఆలోచిస్తూ ఉండగా ఏమైంది అని అడగగా ఏమీ లేదు అని అంటుంది వసు. పక్కనే ఉన్న గౌతమ్ వసుధార బాధపడకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఫస్ట్ తిను ప్లీజ్ అని అంటాడు. అప్పుడు రిషి ఏమైంది నీకు ఎప్పటిలాగా లేవు అని అనగా ఏం లేదు సార్ కొంచెం తలనొప్పిగా ఉంది అని అనగా టాబ్లెట్ తెప్పించమంటావా అని అనడంతో వద్దు సార్ అని అనగా సరేలే తిను వసుధార అని అంటాడు.
 

 అప్పుడు రిషి సంతోషంతో వసుధార నువ్వు భోజనం చేయి తిన్న తర్వాత నీకు ఒకటి చూపిస్తాను. అని అంటాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు గతంలో ఉయ్యాల ఊగిన చోటికి వెళ్తారు. అప్పుడు వసుధార డల్ గా ఉండడంతో రిషి చూడు వసుధార లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని నచ్చచెబుతూ ఉంటాడు రిషి. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి త్వరగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధార వచ్చి ఉయ్యాల్లో కూర్చో అని రిషి అనగా ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు రిషి ఏమైంది అనుకుని ఆలోచనలో పడతాడు. మరొకవైపు ఇంటికి వెళ్లిన వసుధార ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జగతి ఏంటి వసుధార ఇది ఎవరో ఏదో అన్నారని నువ్వు ఏడుస్తూ ఉంటావా అని అంటుంది.
 

ఎందుకు మేడం ఎదుటి వ్యక్తుల గురించి ఇలా తప్పుగా మాట్లాడతారు అంటూ ఎమోషనల్ అవుతూ ఉండగా జగతి నచ్చచెబుతుంది. వాళ్లకు నాతో శత్రుత్వం ఏంటి మేడం గుండెలు కోసేసేలా మాట్లాడుతారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. అప్పుడు జగపతి శత్రుత్వం అవసరం లేదు వసుధార ఒంటరి అమ్మాయి వాళ్లకు టాపిక్ మాట్లాడుకోవడానికి దొరికింది ఏవైనా మాట్లాడుకుంటారు దానికి నువ్వు బాధపడకు అని అంటుంది జగపతి. అప్పుడు జగతి,వసుధార నువ్వు మీ ఊరికి వెళ్ళు. మీ ఊరికి వెళ్లి మీ అమ్మానాన్నలతో ధైర్యంగా మాట్లాడు జరిగింది మొత్తం చెప్పు అనడంతో వసుధార షాక్ అవుతుంది. నేను ఎందుకు వెళ్ళమంటున్నానో నాకు స్పష్టత ఉంది ఇంక ఆలస్యం చేయకు ఊరికి వెళ్ళు అని అంటుంది జగతి.

click me!