Mukhachitram Review: `ముఖచిత్రం` రివ్యూ.. లాయర్‌గా విశ్వక్‌ సేన్‌ అదరగొట్టాడా?

First Published | Dec 9, 2022, 8:53 AM IST

ఫేస్‌ మార్ఫింగ్‌ అనే కాన్సెప్ట్ తో ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నాలుగేండ్ల క్రితం హైదరాబాద్‌లో భర్త ఫేస్‌ మార్ఫింగ్‌ చేసిన కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాంటి కథతోనే ఈ సినిమా రూపొందింది. సినిమా నేడు శుక్రవారం(డిసెంబర్‌ 9)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

ప్రస్తుతం థ్రిల్లర్‌ చిత్రాల హవా సాగుతుంది. ఓటీటీలు వచ్చాక వీటికి మరింత ఆదరణ పెరుగుతుంది. థియేటర్లలోనూ ఆడుతున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా థ్రిల్లర్‌ నేపథ్యంలోనే `ముఖచిత్రం` వచ్చింది. ఫేస్‌ మార్ఫింగ్‌ అనే కాన్సెప్ట్ తో ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో భర్త ఫేస్‌ మార్ఫింగ్‌ చేసిన కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాంటి కథతోనే ఈ సినిమా రూపొందింది. `కలర్‌ఫోటో`తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం.  విశ్వక్‌ సేన్‌ గెస్ట్ రోల్‌లో, వికాష్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావు, ఆయేషా ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గంగాధర్‌ దర్శకత్వం వహించారు. సినిమా నేడు శుక్రవారం(డిసెంబర్‌ 9)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. Mukhachitram Review.

కథః
రాజ్‌కుమార్‌(వికాస్‌ వశిష్ణ) పాపులర్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌.. పల్లెటూరి పిల్ల మహతి(ప్రియా వడ్లమాని) చూసి ఇష్టపడతాడు. పెళ్లి చూపుల్లో ఆమెని ఫిదా చేసి పెళ్లి చేసుకుంటాడు. వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. అదే సమయంలో స్కూల్‌ డేస్‌ నుంచి తనస్నేహితురాలు మాయా(ఆయేషా ఖాన్‌) తనని ప్రేమిస్తుంది. ఆ విషయం రాజ్‌ పెళ్లి సెట్‌ అయ్యిందనప్పుడు చెబుతుంది. కానీ ప్రయోజనం లేదు. ఇక తాను గర్భవతి అనే విషయాన్ని రాజ్‌కుమార్‌కి చెప్పాలనుకుంటుంది మహతి. సరిగ్గా అదే సమయంలో మాయ రోడ్డు ప్రమాదానికి గురైందని ఫోన్‌ రావడంతో ఆ విషయం చెప్పలేకపోతుంది. రోడ్డు ప్రమాదంలో మాయ ముఖం మొత్తం డ్యామేజ్‌ అవుతుంది. ఆమెది రేర్‌ బ్లడ్‌ గ్రూప్‌. మహతి బ్లడ్‌ మ్యాచ్‌ కావడంతో మాయకి రక్తదానం చేస్తుంది. ఆ నెక్ట్స్ డే అనుకోకుండా ఇంట్లో పై ఫ్లోర్‌ నుంచి జారి కిందపడిపోయిన మహతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూస్తుంది. మాయకి మహతి ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి మహతి చనిపోలేదని వాళ్ల ఫ్యామిలీని నమ్మిస్తాడు రాజ్‌. మాయనే మహతిగా ఊహించుకుని ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు హాస్పిటల్‌ వర్క్ మీద రాజ్‌వేరే స్టేట్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మహతిగా ఉన్న మాయకి ఇంట్లో మహతి ఫోన్‌ దొరుకుతుంది. అందులో వాట్సాప్‌ చెక్‌ చేయగా, రాజ్‌ గురించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయం తెలుస్తుంది. ఆ ఫోన్‌లో ఏముంది? రాజ్‌పై మాయ ఎందుకు కేసు పెట్టింది? మహతి చావుకి కారణం ఎవరు? ఆ కేసుని లాయర్‌ విశ్వక్‌ సేన్‌ వాదించడానికి కారణమేంటి? ఇంతకి విశ్వా ఎవరు? అనేది మిగిలిన కథ. Mukhachitram Review.

Latest Videos


విశ్లేషణః 
ఫేస్‌ మార్ఫింగ్‌ అనే కాన్పెస్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇంట్లో భార్యపై హరాస్‌మెంట్‌ అంశాలను ఇందులో ఆవిష్కరించాడు దర్శకుడు గంగాధర్‌. కాంటెంపరీ కథని ఎంచుకుని అంతే క్రిస్పీగా తెరకెక్కించడం విశేషం. నాలుగేండ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ వివాహిత ప్రియుడిపై మోజుతో భర్తని చంపేసి భర్త ఫేస్‌ని ప్రియుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించి ఫేస్‌ మార్ఫింగ్‌ చేయించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులోనూ అలాంటి పాయింట్‌నే చర్చించారు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. అయితే కథని నడిపించిన తీరు కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీకి, ఫేస్‌ మార్ఫింగ్‌కి, సెక్స్ వల్ అబ్యూజింగ్‌ అంశాలను ముడిపెట్టిన తీరు బాగున్నా. ఒకానొక దశలో అది ట్రాక్‌ తప్పినట్టుగా ఉంటుంది. మొదటి భాగంగా సాధాసీదాగానే సాగుతుంది. మెస్మరైజింగ్‌ చేసే అంశాలేవి ఉండవు. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ రెండు మూడు జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. 

ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాస్త ఫేస్‌ మార్ఫింగ్‌కి వెళ్లడం, థ్రిల్లర్‌గా మారడం, అక్కడి నుంచి సెక్సువల్‌ అబ్యూజింగ్‌ అంశాలతో ముడిపెట్టడం అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. అందులో చర్చించిన ఫ్యామిలీ అంశాలు ఆకట్టుకుంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సెక్సువల్‌ అబ్యూజింగ్‌ అనే పాయింట్‌ని చర్చించిన తీరు బాగుంది. అయితే దాన్ని ఎవరూ ఇప్పటి వరకు పాయింట్‌ ఔట్‌ చేయలేదు. ఇందులో ఆ విషయాన్ని బట్టలిప్పదీసి బయటపెట్టారు మేకర్స్. అయితే ఫ్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగానే వెళ్తుంది. కానీ క్లైమాక్స్‌ తేలిపోయింది. విశ్వక్‌ సేన్‌ లాయర్‌గా ఎంట్రీతో `వకీల్‌ సాబ్‌`లో కోర్ట్ రూమ్‌ డ్రామా గుర్తొస్తుంది. కానీ ఆ రేంజ్‌లో డ్రామాని రక్తికట్టించడంలో దర్శకుడు విఫలమయ్యారు. విశ్వక్‌ పాత్రతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందని అంతా భావించగా అది కాస్త డిజప్పాయింట్‌ చేస్తుంది. క్లైమాక్స్ తేలిపోవడంతో సినిమా యావరేజ్‌గానే మిగిలిపోయింది. అదే క్లైమాక్స్ ని మరింత రక్తికట్టించేలా ప్లాన్‌ చేసి ఉంటే సినిమా ఫలితం నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. నిడివి కలిసొచ్చే అంశం. Mukhachitram Review.

నటీనటులుః 

మహతిగా చేసిన ప్రియా వడ్లమాని సినిమాకి ప్రాణం పోసింది. సినిమాని తనే మోసింది. ఓ రకంగా సైలెంట్‌గా విశ్వరూపం చూపించింది. ఇన్నోసెంట్‌గా, బోల్డ్ గా, భర్తపై తిరగబడే మహిళగా విభిన్న షేడ్స్ ని అద్బుతంగా చూపించింది. నటిగా ఆమెకిది నెక్ట్స్ లెవల్‌ చిత్రమవుతుందని చెప్పొచ్చు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పాత్రలో వికాస్‌ చాలా బాగా చేశాడు. కొత్త కుర్రాడైనా మెప్పించాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. మాయగా ఆయేషా ఖాన్‌ సైతం ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్‌ సత్యగా చైతన్య రావు మెప్పించాడు. కాస్త నవ్వించాడు. సినిమాకి ఈ నాలుగు పాత్రలు నాలుగు పిల్లర్స్ లాంటివి. లాయర్‌గా విశ్వక్‌సేన్‌ సెట్‌ కాలేదు.

టెక్నీషియన్లుః 
సందీప్‌ రాజ్‌ ఎంచుకున్న కథ బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. కానీ కథని తీసుకెళ్లిన తీరు కొంత కన్ఫ్యూజ్‌ చేస్తుంది. అదే కన్‌ఫ్యూజన్‌ దర్శకుడిలోనూ కనిపించింది. దీంతో ఇది రెగ్యూలర్‌ థ్రిల్లర్‌ చిత్రంగా నిలిచిపోయింది. అయితే చర్చించిన ఫ్యామిలీ అంశాల విషయంలో అభినందించాల్సిందే. దర్శకుడిగా గంగాధర్‌ మెప్పించాడు. వినోదానికి స్కోప్‌ ఉన్నా, ఆ విషయంలో పెద్దగా ఫోకస్‌ చేయకపోవడం మైనస్‌. సంగీతం సినిమాకి బలం. కథని రేసీగా తీసుకెళ్లడంతో కాల భైరవ బీజీఎం బాగుంది. శ్రీనివాస్‌ బెజుగం కెమెరా వర్క్ బాగుంది. పాకెట్‌ మనీ పిక్చర్స్ నిర్మాణానికి వంక పెట్టడానికి లేదు. 

ఫైనల్‌గాః డిఫరెంట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌. ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రాలకు ఓటీటీలో ఆదరణ ఉంటుంది, థియేటర్లలో డౌటే..

రేటింగ్‌ః 2.5
 

click me!