రష్మిక మందన్నా పెళ్లై వారం కూడా కాలేదు. పిల్లలకు సంబంధించిన ఆమె ఫీలింగ్స్ ని బయటపెట్టింది. ఇప్పటికే తల్లి అయినట్టుగా ఉందని చెప్పింది. మరి త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెబుతుందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు తన ప్రియుడు హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. ఈ ఇద్దరు దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన తమ ప్రేమని ఏకంగా పెళ్లితో బహిర్గతం చేశారు. చాలా గ్రాండ్‌గా తమ మ్యారేజ్ చేసుకోవడం విశేషం. ఇప్పుడు అంతా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ సొంతూరులో సోమవారం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.
25
పిల్లలపై రష్మిక మందన్నా కామెంట్
బుధవారం(మార్చి 4)న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్ ప్లాన్ చేశారు. తాజ్ కృష్ణలో వీరి రిసెప్షన్ జరుగుతుంది. ఈ క్రమంలో రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. రష్మిక మందన్నా ఇటీవల తల్లితత్వం, పిల్లల గురించి మాట్లాడుతూ, తన అభిప్రాయాలను పంచుకుంది. పిల్లలు కనిపిస్తే, తాను సహజంగానే ఆకర్షితులవుతానని, వారికి రక్షణగా ఉంటానని తెలిపింది.
35
ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్ ఉందని రష్మిక కామెంట్
అంతేకాదు పిల్లల విషయంలో తాను చాలా ఎమోషనల్ అని, కొన్ని సార్లు ఇప్పటికే తాను తల్లిని అయిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది రష్మిక. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టినప్పటికీ త్వరలో కుటుంబం ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది రష్మిక. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది. ఓ ఇంటికి ఇల్లాలు అయిపోయింది. ఇక మిగిలింది తల్లికావడం మాత్రమే.
మరి రష్మిక, విజయ్‌లు వెంటనే పిల్లలకు ప్లాన్ చేస్తారా? దానికి టైమ్ తీసుకుంటారా? అనేది చూడాలి. అయితే పిల్లలను కనే విషయంలో తాను మాత్రం పూర్తిగా వారి కేరింగ్‌లో ఉంటానని వెల్లడించింది. అంటే పిల్లలకు ప్లాన్ చేస్తే, సినిమాలు ఆపేస్తుందని చెప్పొచ్చు. అది ఎప్పుడు జరుగుతుందనేది చూడాలి. బహుశా కొంత కాలం తర్వాత పిల్లలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా కూడా అదే దారిలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
55
రష్మిక మందన్నా చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. విజయ్ దేవరకొండతోనే `రణబాలి` చిత్రంలో నటిస్తోంది. `డియర్ కామ్రేడ్` తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇటీవలే దీన్నుంచి మంచి ట్రీట్ వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు లేడీ ఓరియెటెండ్ మూవీ `మైసా` లో నటిస్తుంది. ఇది పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. అలాగే అల్లు అర్జున్ 22 మూవీలో, `కాక్ టైల్ 2`లో నటిస్తుంది.