కొప్పున పూలెట్టుకుని కేక పెట్టిస్తున్న బన్నీ భామ.. రష్మిక చేసిన చిలిపి పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Published : Aug 17, 2021, 07:43 PM ISTUpdated : Aug 18, 2021, 07:32 AM IST

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌. కోట్లాది మంది అభిమానుల కలల రాణి. జెట్‌ స్పీడ్‌తో శాండల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌కి దూసుకెళ్లిన సునామీ. టాలెంట్‌కి కేరాఫ్‌ అయిన ఈ అందాల భామ తాజాగా చేసిన చిలిపి పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   

PREV
17
కొప్పున పూలెట్టుకుని కేక పెట్టిస్తున్న బన్నీ భామ.. రష్మిక చేసిన చిలిపి పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

రష్మిక మందన్నా ఇప్పుడు అభిమానులను షాకిస్తుంది. కొప్పున పూలు పెట్టుకుని పోజులిచ్చింది. చైర్‌లో కూర్చొని చిలిపిగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

27

మల్లెపూలు కొన్ని మూరలు తీసుకుని నెత్తిన పెట్టుకుని పోజులిచ్చింది రష్మిక. అంతేకాదు ఈ పిక్స్ ని ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకోగా ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

37

ఈ సందర్భంగా రష్మిక చెబుతూ, మీకు నచ్చినదాన్ని తీసుకోండి. నా సినిమా షాట్ల మధ్య నేను ఖాళీగా ఉన్నప్పుడు జాబ్‌ లేకుండా ఉన్నప్పుడు ఇదే పనిచేస్తానని చెప్పింది రష్మిక. 

47

ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఏ పనిలేకపోతే రష్మిక పూలమ్ముకుంటుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో పెద్ద స్టార్ అయి ఉండి ఇలా చిలిపిగా వ్యవహరించడం ఆమె కల్మషం లేని
తత్వానికి నిదర్శమని ఫిదా అవుతున్నారు అభిమానులు. 

57

మొత్తంగా రష్మిక చేసిన ఈ చిలిపి పని వైరల్‌గా మారింది. అయితే ఈ సందర్భంగా రష్మిక చీరకట్టులో ఉండటం విశేషం. దీంతో మరింతగా ఆకట్టుకుంటుందీ అందాల భామ. 

67

రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో బన్నీ సరసన `పుష్ప` చిత్రంలో నటిస్తుంది.

77

అలాగే శర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది. హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది రష్మిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories