నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. తరచూ ఫ్యాన్స్ తో ఛాట్ చేస్తుంటుంది రష్మిక. ఇలా అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అయితే సోషల్ మీడియాలో అందరికి రియాక్ట్ కావడమనేది సాధ్యం కాదు. కొంత మంది అభిమానులకే రియాక్ట్ అవుతారు. అలాంటి రియాక్షన్ దొరికి అభిమానికి పండగే.
ఈ క్రమంలో చాలా మంది అభిమానులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్లు ఆమె పరిస్థితి అర్థం చేసుకుంటారు. సెలబ్రిటీలకు టైమ్ చాలా తక్కువ అనేది వాళ్లకి తెలుసు, కానీ తమ పోస్ట్ లకు, తమ రియాక్షన్లకి ఒకలైకో, లేదంటే హాయ్ అని రిప్లై ఇస్తే వారి సంతోషానికి అవధులు ఉండవని చెప్పొచ్చు. తాజాగా ఓ అభిమాని చేసిన పని, దానికి రష్మిక మందన్నా రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా రష్మిక మందన్నా ఇన్‌స్టాలో సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. షూటింగ్ గ్యాప్‌లో ఈ ఫోటోలను తీసుకుంటున్నట్టు తెలిపింది. అదే సమయంలో `యానిమల్` మూవీ సక్సెస్ తర్వాత తాను అభిమానులను కలవలేకపోయానని బాధపడింది. ఫ్యాన్స్ తో చాట్ చేయలేకపోయానని, షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని అందుకే కుదరలేదని,మీకు మంచి సినిమాలు అందించేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నట్టు తెలిపింది రష్మిక మందన్నా.
అయితే ఓ అభిమాని తనకు రష్మిక రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారం రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టాడు. `ఈ రోజు నవ్వు కనీసం హాయ్ అని రిప్లై ఇవ్వకపోతే ఏమీ తినను, నిరాహార దీక్ష చేస్తా` అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి రష్మిక స్పందించలేదు. తాజాగా రష్మిక పెట్టిన సెల్ఫీ ఫోటోలను షేర్ చేస్తూ మిర్రర్ సెల్ఈ తీసుకున్నావ్ అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవచ్చుగా అంటే కన్నీళ్లు పెడుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు సదరు అభిమాని.
లక్కీగా రష్మిక ఈ పోస్ట్ చూసింది. సర్‌ప్రైజింగ్ రిప్లై మనోడి పంట పండింది. ఇంతకి రష్మిక మందన్నా ఏమని రిప్లై ఇచ్చిందంటే.. నవ్వుతూ ఉన్న ఎమోజీలను పంచుకుంటూ `గ్యాప్ లో అంట.. వర్క్ గ్యాప్ లో ఈ సెల్ఫీ తీసుకున్నాన్ రా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే` అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా అభిమాని స్పందిస్తూ `నువ్వు అలా `రా` అంటుంటే ఎంత బాగుందో` అంటూ రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. మొత్తానికి సాధించావని, ఇతన అభిమానులు కామెంట్ పెడుతున్నారు. పంట పడిందని, నీ పొలంలో మొలకలొచ్చాయని సెటైరికల్‌గా కామెంట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక రష్మిక మందన్నా ఇటీవల `యానిమల్` సినిమాతో దుమ్మురేపింది. ఇందులో బోల్డ్ గా నటించింది. కానీ ఆమెకి పేరు, క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు మరో భారీసినిమాలో నటిస్తుంది. `పుష్ప 3` షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇంది కూడా పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.
దీంతోపాటు `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ,అలాగే `ది గర్ల్ ఫ్రెండ్` అనే మరో మహిళా ప్రధాన మూవీ చేస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు ధనుష్, నాగార్జున చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇలా వరుసగా మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. రాత్రి, పగలు వర్క్ చేస్తుందట. రాత్రిళ్లు జర్నీ చేయాల్సి వస్తుందట. అస్సలు గ్యాప్ ఉండటం లేదని ఆమె పోస్ట్ పెట్టిన విసయం తెలిసిందే.