Pragya Jaiswal : సామి కార్యం స్వకార్యం, రెండూ పూర్తి చేసిన ప్రాగ్యా జైశ్వాల్.. రకుల్ పెళ్లికెళ్లి ఇలా!

First Published | Feb 25, 2024, 11:15 PM IST

గ్లామరస్ హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal)  బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. అయితే రీసెంట్ గా రకుల్ పెళ్లికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ తన ముచ్చట కూడా పూర్తి చేసుకుంది. 

‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై ఎంత పద్ధతిగా, హుందాగా కనిపిస్తుందో తెలిసిందే. 

టాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. కేవలం తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన కెరీర్ కు ఉపయోగపడేలా సినిమాలు చేస్తోంది. 


చివరిగా ‘అఖండ’తో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 

ఈ క్రమంలో తాజాగా ప్రాగ్యా రెడ్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో మెరిసింది. రెడ్ రోజ్ లు మొత్తం తన ఒంటికి అతికించుకుట్లున్న డ్రెస్ లో ఆకర్షణీయంగా ఫొటోషూట్ చేసింది. 

బీచ్ లో రెడ్ డ్రెస్ లో ప్రాగ్యా జైశ్వాల్ నెక్ట్స్ లెవ్ లో మెరిసింది. కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. అందమైన బీచ్ లో అదిరిపోయే ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. అయితే ఈ ఫొటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. 

రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ పెళ్లి కోసం వెళ్లిన సమయంలో... హల్దీ ఫంక్షన్ లో ఇలా రెడ్ డ్రెస్ లో ముస్తాబైనట్టు చెప్పింది. ఈ సందర్భంగా తనకు నచ్చిన విధంగా ఫొటోషూట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. 

Latest Videos

click me!