స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో తెలిసిందే. ఆమె నటన, అందంతో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. స్టార్స్ నటన నటించి మెప్పించింది.
చివరిగా మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట‘, నాని సరసన ‘దసరా’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది.
సినిమాల పరంగా ఈ ముద్దుగుమ్మ ఎంత యాక్టివ్ గా అప్డేట్స్ అందిస్తుందో మరోవైపు సోషల్ మీడియాలో, ఆయా ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటోంది.
ఈ క్రమంలో తనకు ఫస్ట్ లెటర్ ఇచ్చిన వ్యక్తి గురించి తాజాగా కీర్తి చెప్పుకొచ్చింది. తను ఓ నగల దుకాణం ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనకు ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని చెప్పింది.
ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తన అరుదైన ఫొటోలతో పాటు ఓ లెటర్ కూడా ఉందంట. ఆ లెటర్ లో తన అభిమాని కీర్తిని ప్రేమిస్తున్నాడని రాసుకొచ్చాడంట. తనను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని తెలిపింది.
స్కూల్, కాలేజీలో మాత్రం ఎలాంటి లవ్ లెటర్లు రాకపోయినా.. అభిమాని నుంచి ఫస్ట్ లవ్ లెటర్ ఇలా అందిందని చెప్పింది. ఇక చివరిగా కీర్తి ‘సైరెన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.