ఆ హీరోతో రూమర్‌ నిజమే అని తేల్చి చెప్పిన రష్మిక మందన్నా..ఏకంగా ప్రూఫ్ చూపించి మరీ క్లారిటీ!

Published : Jul 12, 2022, 11:37 PM IST

హీరోయిన్లపై చాలా రకాల రూమర్స్ వస్తుంటాయి. నెక్ట్స్ సినిమాలు, లవ్‌, మ్యారేజ్‌, బిజినెస్‌, పారితోషికం ఇలా ఏదైనా రూమర్ రావచ్చు. కానీ స్పందించడం చాలా అరుదు. తాజాగా రష్మిక మందన్నా మాత్రం లేటెస్ట్ గా తనపై వచ్చిన రూమర్ పై స్పందించడం విశేషం. 

PREV
16
ఆ హీరోతో రూమర్‌ నిజమే అని తేల్చి చెప్పిన రష్మిక మందన్నా..ఏకంగా ప్రూఫ్ చూపించి మరీ క్లారిటీ!

నేషనల్‌ క్రష్‌గా పేరుతెచ్చుకుంది రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే కన్నడ నుంచి బాలీవుడ్‌ అట్నుంచి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `పుష్ప` చిత్రం ఆమెకి పాన్‌ ఇండియా స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అంతేకాదు బాలీవుడ్‌లోనూ అవకాశాలు తెచ్చిపెట్టింది. 
 

26

ప్రస్తుతం వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా ఓ రూమర్ పై స్పందించింది. బాలీవుడ్‌ హీరోకి, తనకు సంబంధించిన ఓ రూమర్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది రష్మిక మందన్నా. 

36

ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌ బై`తోపాటు రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది. దీనికి సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు మరో ప్రాజెక్ట్‌ కి కమిట్‌ అయ్యిందని, యంగ్‌ సెన్సేషనల్‌ హీరోతో రొమాన్స చేయబోతుందని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. 

46

ఈ నేపథ్యంలో దీనిపై రష్మిక మందన్నా స్పందించింది. క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోతో చేయబోతున్నది నిజమే అని తెలిపింది. ఆ హీరో ఎవరో కాదు టైగర్‌ ష్రాఫ్‌(Tiger Shroff). అయితే ఆమె చేయబోయేది సినిమా కాదు. కమర్షియల్‌ యాడ్‌. టైగర్‌తో కలిసి రష్మిక ఓ యాడ్‌ చేస్తుందట. ఆ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా దిగిన ఓ ఫన్నీ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది రష్మిక. 

56

ఇందులో రష్మిక మందన్నా చెబుతూ, అవును ఆ రూమర్ నిజమే. చాలా నవ్వొస్తుంది. నేను, టైగర్‌ కలిసి ఓ యాడ్‌ చేశాం. టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్‌ కోసం వెయిటింగ్‌` అని పంచుకుంది రష్మిక. ఈ సందర్భంగా పంచుకున్న స్టోరీని టైగర్‌ కూడా షేర్‌ చేస్తూ, `షూట్‌ చేయడం సరదాగా ఉంది. నువ్వు ఎప్పటిలాగే అదరగొట్టావు` అని తెలిపాడు టైగర్‌. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 

66

ఇక రష్మిక మందన్నా హిందీ సినిమాలతోపాటు తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. అలాగే `సీతారామమ్‌`లో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు విజయ్‌తో వంశీపైడిపల్లి చిత్రం `వారసుడు`లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్నా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories