`జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌కి ఘోర అవమానం ?.. అందుకే దూరమయ్యాడా ?.. బయటకొస్తున్న సంచలన నిజాలు ?

Published : Jul 12, 2022, 08:27 PM ISTUpdated : Jul 12, 2022, 08:28 PM IST

`జబర్దస్త్` నుంచి సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఒక్కొక్కటిగా ఆయన అన్ని షోలు వదిలేశాడు. దీంతో ఆయన వెళ్లిపోవడానికి కారణం ఇదే అంటూ కొన్ని విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
`జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌కి ఘోర అవమానం ?.. అందుకే దూరమయ్యాడా ?.. బయటకొస్తున్న సంచలన నిజాలు ?

`జబర్దస్త్`లో (Jabardasth) ప్రారంభం నుంచి ఉన్నారు సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer). మేజీషియన్‌ నుంచి కామెడీ ఆర్టిస్ట్ గా ఎదిగారు. టీమ్‌ లీడర్‌గానూ పేరుతెచ్చుకుని కొన్ని ఏళ్లపాటు జబర్దస్త్ షోని శాషించాడు. తన టీమ్‌ మెంబర్స్ గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌లతో కలిసి ఆద్యంతం నవ్వులు పూయించారు. మధ్యలో హైపర్‌ ఆదిని కూడా కలుపుకుని కామెడీని పంచారు. ప్రతి వారం వీరి ఎపిసోడ్‌లోని ఏదో ఒక విషయం హైలైట్‌గా నిలవడం విశేషం. 

28

ఇదిలా ఉంటే `జబర్దస్త్` షోని మల్లెమాల(నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి) సంస్థ నిర్వహిస్తుంటారు. దీంతోపాటు ఈటీవీ ప్రసారమయ్యే `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` కూడా మల్లెమాల నిర్వహణలోనే జరుగుతుంటాయి. వీరి అండర్‌స్టాండింగ్‌(డీల్)తో ఈటీవీలో ప్రసారమవుతుంటాయి. ఇందులో పాల్గొనే ఆర్టిస్టుల నిర్వహణ మొత్తం, సెలెక్షన్‌ నుంచి స్కిట్ల వరకు మల్లెమాల సంస్థ నియంత్రణలోనే జరుగుతుంటాయని అందరికి తెలిసిందే. 
 

38

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌ కొంత కాలంగా నెమ్మదిగా ఒక్కో షో నుంచి బయటకు తప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో రష్మి, సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ ఎక్కువ అవ్వడం, వారినే హైలైట్‌గా చూపించడంతో షోని డామినేట్ చేసే స్థాయికి ఎదిగారని, అందులో భాగంగానే `ఢీ` షో నుంచి రష్మి, సుధీర్‌లను తొలగించారని ప్రచారం జరిగింది. వీరితోపాటు దీపికా పిల్లి, పూర్ణలని కూడా దూరం పెట్టిన విషయం తెలిసిందే. అయితే అది కొత్తదనం కోసం మార్చినట్టు వార్తలొచ్చాయి. కానీ దాని వెనకాల మరో కారణం ఉందనే టాక్ ఉంది. 
 

48

ఇటీవల `జబర్దస్త్` నుంచి, ఆ తర్వాత కొన్ని రోజులకే `శ్రీదేవి డ్రామా కంపెనీ` నుంచి సుధీర్‌ వైదొలిగాడు. ఆయనకు హీరోగా వరుస అవకాశాలు రావడం, వాటి షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే సుధీర్‌ తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ సుధీర్‌ `స్టార్‌ మా`లో నాగబాబుతో కలిసి ఓ షో చేస్తున్నారు. మరి దానికి సమస్య లేనిది, ఈటీవీ షోస్‌కి ఎందుకొచ్చిందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 

58

తాజాగా ఓ యూట్యూబ్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ కమేడియన్ కిర్రాక్‌ ఆర్పీ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. మల్లెమాల వాళ్లు ఆర్టిస్టులను పట్టించుకోరని, ఫుడ్‌, వాటర్ కూడా ఇవ్వరని, చాలా దారుణంగా ట్రీట్‌ చేస్తారని, అందుకే తాము వైదొలిగినట్టు చెప్పి సంచలనాలకు తెరలేపారు. సుడిగాలి సుధీర్‌ కి `జబర్దస్త్`లో ఘోర అవమానం జరిగిందని, గెటప్‌ శ్రీను, హైపర్‌ ఆది కూడా అందుకే `జబర్దస్త్` ని వీడాల్సి వచ్చిందని చెప్పడం పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

68

దీనికితోడు `ఈటీవీ` వాళ్లు పెట్టే కండీషన్స్ కూడా సుధీర్‌ వెళ్లిపోవడానికి కారణమని టాక్‌. తమ ఛానెల్‌లో షోస్‌ చేసేటప్పుడు ఇతర టీవీ షోస్‌లో చేయొద్దనే నిబంధన ఉందట. ఈ కఠిన నిబంధన ఆర్టిస్టుల ఎదుగుదలని ఆపేస్తాయని, అది నచ్చకే, ఆ విషయంలో విభేదాల కారణంగానే సుధీర్‌ తప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుధీర్‌ `స్టార్‌ మా`లో ఓ షోకి హోస్ట్ గా చేయడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 

78

మరోవైపు దీనిపై హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ స్పందించారు. కిర్రాక్‌ ఆర్పీ విమర్శల్లో నిజం లేదని, తాము బాగానే ఉన్నామని, సుధీర్‌, ఇతర ఆర్టిస్టులు `జబర్దస్త్` ని వీడడానికి కారణం వారు సినిమాల్లో బిజీగా ఉన్నారని, డేట్స్ సెట్‌ కాక గ్యాప్‌ ఇచ్చారని, మళ్లీ వస్తారని తెలిపారు. `మల్లెమాల` నిర్వహకులు, ఈటీవీ వాళ్లు ఆర్టిస్టులను తక్కువగా ట్రీట్‌ చేస్తారనడంలో నిజం లేదని తెలిపారు.

88

అయితే నాగబాబు వెనకాల ఉంది కిర్రాక్‌ ఆర్పీతో ఈ విమర్శలు చేయిస్తున్నారని, `మల్లెమాల`పై తనకున్న కోపాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారని, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories