హీరోయిన్‌గా తెలుగుతోపాటు సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. బోల్డ్ హీరోయిన్‌గా, బోల్డ్ పాత్రలతో పాపులర్ అయ్యింది. హాట్ అందాలతో ఆడియెన్స్ ని అలరించింది. లక్షలాది మందిని అభిమానులుగా చేసుకుంది. ఓ వైపు సినిమాలు, ఇంకోవైపు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ అందాల హాట్ భామ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.
నటి పూర్ణకి, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ షానిద్ అసిఫ్ అలీతో మ్యారేజ్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న తాను జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ఫౌండర్ సీఈవో షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఇద్దరు క్లోజ్‌గా ఉన్న అందమైన ఫోటోని పంచుకుంది పూర్ణ. రింగ్‌ని కూడా షేర్ చేసుకుంది.
తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఆయా ఎంగేజ్‌మెంట్‌ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది పూర్ణ. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు రోజులుగా ఓ సిరీస్ వైజ్‌గా తన ఎంగేజ్‌మెంట్ పిక్స్ ని షేర్ చేసుకుంది. సిరీస్ 1 అంటూ కొన్ని పిక్స్ ని పంచుకుంది. ఇందులో పూర్ణ ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తన సింగిల్ ఫోటో షూట్ పిక్స్ ఉన్నాయి.
మరో పోస్ట్ లో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా ఉంది పూర్ణ. సేమ్ డ్రెస్ కోడ్‌లో పూర్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు తన పేరెంట్స్ తో పూర్ణ దిగిన ఫోటోలు ఆద్యంతం హైలైట్‌గా నిలిచాయి. పూర్ణని ముద్దాడుతుండగా, ఎంతో సహజంగా కెమెరాలో బంధించిన తీరు మరింత హైలైట్ అవుతుంది.
ఇందులో పూర్ణ ఓ యువరాణిలా, ప్రిన్సెస్‌లా ఉన్నారు. రాజ్యంలోని అందాల యువరాణిని తలపిస్తుంది. గ్రాండ్‌గా డిజైనింగ్ వేర్‌లో కనిపిస్తూ కనువిందు చేస్తుంది. అలానే చూస్తూ ఉండిపోయేంతటి అందం పూర్ణ సొంతం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పూర్ణ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్బంగా పూర్ణ చెబుతూ, నేను నా ఫోటోలతో ప్రేమలో పడ్డా. నా జీవితంలోని మధుర క్షణాలను క్యాప్చర్ చేసిన కెమెరామెన్‌కి ధన్యవాదాలు` అని పేర్కొంది పూర్ణ. ఈ సందర్భంగా తన ఫోటోలతోపాటు వీడియోలను పంచుకుంది పూర్ణ.
దీంతో సెలబ్రిటీలు, ఆమె అభిమానులు పూర్ణ-షానిద్ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటోల్లో తన కాబోయే భర్త షానిద్ లేకపోవడం గమనార్హం. ఎంగేజ్‌మెంట్ సిరీస్ 1 అంటూ కేవలం తన ఫోటో షూట్ పిక్స్, తన ఫ్యామిలీ ఫోటోలను మాత్రమే పంచుకుంది పూర్ణ. మిగిలిన ఎంగేజ్‌మెంట్ పిక్స్ మరో సెట్‌లో పంచుకునే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే పూర్ణ మ్యారేజ్ నవంబర్‌లో జరుగుతుందని తెలుస్తుంది. ఆల్ రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని అందులో భాగంగా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది.
అయితే ఎంగేజ్‌మెంట్ మాత్రం చాలా గ్రాండ్‌గా చేశారు. అక్కడ డెకరేషన్, గ్రాండియర్ నెస్ చూస్తుంటే ఎంతో అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. ఎంగేజ్‌మెంటే ఈ రేంజ్‌లో చేసుకుంటే ఇక పెళ్లి కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోబోతున్నారని చెప్పొచ్చు.
తెలుగులో పూర్ణ బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. `సీమటపాకాయ్` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన పూర్ణ ఈ సినిమా విజయం సాధించడంతో వరుస ఆఫర్లు అందుకుంది.
`లడ్డుబాబు`, `అవును`, `అవును 2`, `శ్రీమంతుడు`, `సుందరి`, వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `తీస్ మార్ ఖాన్` ఒకటి. ఇది రిలీజ్‌కి రెడీ అవుతుంది.
బిజినెస్ మ్యాన్ షానిద్‌తో పూర్ణ ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ఆమె నిశ్చితార్థం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో రాజకుమారిని తలపించేలా ఉంది పూర్ణ.