Rashmika: పేరు మార్చుకున్న రష్మిక మందన్న.. 400 పేద కుటుంబాలకు అతిపెద్ద సాయం

Published : Oct 15, 2026, 10:29 AM ISTUpdated : Oct 15, 2026, 10:41 AM IST

Rashmika Deverakonda: సౌత్ ఇండియాలోని 400 పేద కుటుంబాలకు 'అన్నపూర్ణ' పేరుతో ఏడాది పాటు సరుకులు ఇవ్వడానికి ముందుకొచ్చింది రష్మిక మందన్న. అయితే అక్కడ ఆమె పేరు 'రష్మిక దేవరకొండ'గా మారిపోయింది.

PREV
13
400 కుటుంబాలకు ఏడాది పాటు సరుకులు!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన రష్మిక మందన్న, ఇప్పుడు సమాజానికి తన వంతు సాయం చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటోంది. ఎంపిక చేసిన 400 కుటుంబాలకు రాబోయే ఏడాది పాటు అవసరమైన సరుకులు అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ప్రతి మూడు నెలలకోసారి ఈ కుటుంబాలకు కిరాణా కిట్లను ఇస్తూ, వారి రోజువారీ ఖర్చుల భారాన్ని తగ్గించాలని ఆమె నిర్ణయించుకుంది.

సరుకుల ఖర్చు తగ్గితే, ఆ మిగిలిన డబ్బును ఆయా కుటుంబాలు తమ పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు అవసరాలకు వాడుకోవచ్చు. కాబట్టి, ఇది కేవలం సరుకులు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ కుటుంబాలకు ఆర్థికంగా కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా.

23
ఆదర్శంగా నిలిచిన స్టార్ హీరోయిన్..

గతంలో తాను చేసే సామాజిక కార్యక్రమాలను కేవలం తన సన్నిహితులు, టీమ్ మెంబర్స్‌కు మాత్రమే పరిమితం చేసేదట రష్మిక. కానీ, ఇప్పుడు ఇలాంటి పనుల గురించి పబ్లిక్‌గా చెప్పడం వెనుక వేరే ఉద్దేశం ఉందంటోంది. తాను చేసే పని చూసి, మరొకరు కూడా అవసరంలో ఉన్న కుటుంబానికి సాయం చేయడానికి ముందుకొస్తే.. అంతకంటే పెద్ద సంతోషం మరొకటి ఉండదని ఆమె చెబుతోంది.

మంచి పని చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు లేదా భారీ ప్లానింగ్ అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగ్గట్టుగా చిన్న సాయం చేసినా, అది మరొకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుందనేది ఈ కార్యక్రమం ద్వారా ఆమె ఇస్తున్న మెసేజ్.

కిరాణా కిట్‌లో ఏమేం ఉంటాయి?

అందుతున్న సమాచారం ప్రకారం, ప్రతి కుటుంబానికి మూడు నెలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కిరాణా కిట్‌ను రెడీ చేశారు. ఇందులో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 3 కిలోల రాగులు, 10 లీటర్ల వంట నూనె, మూడు రకాల పప్పులు కలిపి మొత్తం 15 కిలోలు ఉంటాయట.

వీటితో పాటు 2 కిలోల సోయా చంక్స్, 3 కిలోల ఉప్పు, 3 కిలోల చక్కెర, 1 కిలో కారం పొడి, అలాగే తలా 500 గ్రాముల పసుపు, చింతపండు, టీ పొడి కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు, విజయవాడ లాంటి వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన కుటుంబాలకు ఈ సాయం అందనుంది.

33
'రష్మిక మందన్న కాదు ఇకపై రష్మిక దేవరకొండ'

ఈ పోస్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రష్మిక తన పేరును 'రష్మిక మందన్న'కు బదులుగా 'రష్మిక దేవరకొండ' అని రాసుకోవడం. విజయ్ దేవరకొండతో పెళ్లి జరగడంతో.. ఇప్పుడు 'అన్నపూర్ణ' పేరుతో ఇస్తున్న కిరాణా కిట్ ప్రమోషన్ పోస్ట్‌లో ఆమె పేరు స్పష్టంగా 'రష్మిక దేవరకొండ' (Rashmika Deverakonda) అని ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

మొత్తానికి, సినిమాల ద్వారా అలరించే రష్మిక మందన్న.. ఇప్పుడు 400 కుటుంబాలకు సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంది. ఏడాది పాటు సరుకులు ఇచ్చే ఈ ప్రయత్నం ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో చూడాలి. తెరపై కనిపించే 'జయమ్మ' లక్షణాలు నిజ జీవితంలోనూ కనిపిస్తున్నాయని ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories