రష్మిక మందన్నకు 2025 చాలా బిజీగా గడిచింది. ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు 2025కి వీడ్కోలు పలుకుతూ, 2026కి స్వాగతం చెప్పే సమయంలో పాత జ్ఞాపకాల ఫోటోలను పంచుకున్నారు.
దక్షిణ భారత, బాలీవుడ్‌లో రాణిస్తున్న నటి రష్మిక మందన్న 2025లో అత్యంత బిజీ నటి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది ఆమె నటించినవి ఒకటి రెండు కాదు, ఏకంగా ఐదు సినిమాలు.
210
రష్మిక 2025 జ్ఞాపకాలు
ఇప్పుడు 2025కి వీడ్కోలు చెప్పి, 2026కి స్వాగతం పలుకుతూ రష్మిక మందన్న గతేడాది మధుర జ్ఞాపకాల ఫోటోలను పంచుకున్నారు. ఇందులో స్నేహితులు, అమ్మానాన్న, ముద్దుల చెల్లి ఫోటో లను ఆమె షేర్ చేసుకున్నారు.
310
ముద్దుల చెల్లి షిమాన్ మందన్న
రష్మిక, ఆమె చెల్లులు షిమాన్ మందన్న మధ్య దాదాపు 16 ఏళ్ల వయసు తేడా ఉంది. అందుకే తన పాపులారిటీ వల్ల చెల్లికి ఇబ్బంది కలగకూడదని, ఆమెతో ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చేసేది కాదు. తాజాగా ఆమె తన చెల్లెలితో ఉన్న పిక్స్ ను కూడా షేర్ చేసింది.
2026 కొత్త సంవత్సరం మొదలవడంతో తన ముద్దుల చెల్లి షిమాన్‌తో క్యూట్ సెల్ఫీని రష్మిక షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కలాగే చెల్లి కూడా ముద్దుగా ఉంది. షిమాన్‌కి ఇప్పుడు 14 ఏళ్లు.
510
వర్కౌట్ మిస్ చేయని రష్మిక
రష్మిక మందన్న ఎంత బిజీగా ఉన్నా.. వర్కౌట్ మాత్రం మానదు. ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. ఆమె ఏదైనా మిస్ చేసినా జిమ్, వర్కవుట్ అస్సలు మిస్ చేయదు. అందుకే సోషల్ మీడియాలో తన వర్కవుట్ ఫోటోలను కూడా షేర్ చేసింది.
610
స్నేహితులతో ప్రయాణం
నేషనల్ క్రష్ గా.. రష్మిక మందన్న పాన్ ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన క స్నేహితులతో కలిసి ప్రయాణించడం మర్చిపోలేదు. అప్పుడప్పుడు ఆమెతన స్నేహితులను కలిసి రిలాక్స్ అవుతుంటుంది. కానీ విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోలను మాత్రం ఆమె… మిస్ చేసింది.
710
రష్మిక మందన్నకు భక్తి చాలా ఎక్కువ..
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇంట్లో చాలా పూజల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అందమైన చీర కట్టుకుని, నుదుట తిలకం పెట్టుకుని నటి పంచుకున్న ఫోటోలు చూస్తే పూజలో పాల్గొన్నట్టే ఉంది.
810
మ్యాగజైన్ల కవర్ పేజీలపై రష్మిక ఫోటోలు..
2025లో రష్మిక మందన్న ఫెమినా, ది హాలీవుడ్ రిపోర్ట్, డర్టీ కట్ సహా పలు మ్యాగజైన్ల కవర్ పేజీలపై కనిపించింది. దీంతో పాటు పర్సనల్ టైమ్‌ను కూడా నటి ఎంజాయ్ చేసింది.
910
2025 లో రష్మిక మందన్న సినిమాలు..
2025లో రష్మిక ఛావా, సికందర్, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో నటించింది. సికందర్ తప్ప మిగతావన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వచ్చే ఏడాది మైసా, కాక్‌టెయిల్ 2 సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ ఏడాది ఆమె సినిమాలన్నీ నటిగా మంచి పేరును తీసుకువచ్చాయి.
1010
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్..
2025లో అత్యధికంగా చర్చనీయాంశమైన విషయం అంటే.. అది రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం. కానీ ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరి పెళ్లి జరుగుతందని సమాచారం.