టాలీవుడ్ మాజీ హీరోయిన్, మాజీ మంత్రి రోజా కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా? హీరోయిన్లను మించిన గ్లామర్ ఉన్న ఆమె.. ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు? యంగ్ హీరో జంటగా అన్షు నటించబోతుందా? నిజం ఎంత? @rojaselvamanirk)
ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రోజా. ఇటు తెలుగు, అటు తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రోజా.. రెండు భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో చిరు, నాగ్, వెంకీ, బాలయ్య, సుమన్, జగపతి బాబు లాంటి హీరోలతో నటించిన ఆమె.. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్ లాంటి స్టార్స్ తో ఆడిపాడింది. వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగిన రోజా.. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. తమిళ దర్శకుడు సెల్వమణినిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
25
రాజకీయాల్లో రాణించిన రోజా..
పెళ్లి తరువాత రోజాకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి.. దాంతో ఆమె పోలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపించి.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ లో క్రియాశీలక నేతగా కొనసాగిన ఆమె, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో బుల్లితెరపై సందడి చేసిన రోజా.. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.
35
హీరోయన్ గా రోజా కూతురు ఎంట్రీ ఎప్పుడు?
రోజా ప్యామిలీ లైఫ్ ను ఎంజాచ్ చేస్తూ.. పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రోజాకు ఒక కొడుకు, కూతురు ఉండగా.. కూతురు అన్షు రోజాను మించిన గ్లామర్ తో మెరిసిపోతోంది. దాంతో ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందన్న టాక్ గట్టిగా వినిపించించింది. టాలీవుడ్ నుంచిఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక స్టార్ హీరో కొడుకుకి జోడీగా రోజా కూతురు నటించబోతుందని.. ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గతంలో రోజా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మరోసారి చర్చకు వచ్చింది.
రోజా తన కూతురు ఎంట్రీపై.. మాట్లాడుతూ, తన కూతురు అన్షుకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. అన్షు సైంటిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, అందుకే ఆమెను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించినట్లు రోజా వెల్లడించారు. పిల్లలపై తమ అభిప్రాయాలు దుద్దడం తనకు ఇష్టం లేదు అన్నారురోజా.. వారు ఏది చేయాలి అనుకుంటే అది చేయడానికి ఫ్రీడం ఇచ్చినట్టు తెలిపారు. ఇక రీసెంట్ గా వైరల్ అయిన అన్షు పెళ్లి ప్రచారంపై కూడా రోజా స్పందించారు. ఆ హీరో ఎవరో చెబితే బాగుంటుందంటూ నవ్వుతూ సమాధానం చెప్పిన రోజా, ఆ వార్తలల్లో ఎటువంటి నిజం లేదన్నారు.
55
రీ ఎంట్రీ ఇచ్చిన రోజా..
మొత్తానికి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రోజా తన పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా.. ఉన్నత చదువులు చదివిస్తూ.. వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం రోజా.. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తెలుగులో ఓ షోతో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం రోజా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఓ తమిళ సినిమాలో ఆమె నటిస్తున్నట్టు టాక్. మరి అందులో నిజం ఎంతో చూడాలి.