
సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతిదీ ఆడియెన్స్ కి, అభిమానులకు ఆసక్తికరమే. వారి గురించి ఏ కొత్తది తెలిసినా ఆనందిస్తారు. అలాంటివి తెలుసుకోవాలనుకుంటారు. ఇక రేర్ విషయాల పట్ల మరింత ఆసక్తి ఉంటుంది. అదే రేర్ ఫోటోలు, అందులోనూ చిన్ననాటి క్యూట్ అండ్ అన్‌సీన్ పిక్స్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా మన హీరోయిన్లు.. రష్మిక, సమంత, తమన్నా, పూజా, రకుల్, ఇలియానా, అనుష్క, కాజల్, కీర్తిసురేష్, సాయిపల్లవి, నయనతార, త్రిష, జ్యోతిక, అమలాపాల్, నిత్య మీనన్ వంటి హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
15ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది త్రిష. చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఈ భామ చిన్నప్పుడు మాత్రం అందంగా, చలాకీగా ఉంది.
అందాల భామ, మహానటి కీర్తిసురేష్ ఇప్పుడు బలమైన కంటెంట్ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఈ బ్యూటీ చిన్నప్పుడు సో క్యూట్ అనే లా ఉంది. ఆమె ఫోటో వైరల్ అవుతుంది.
నేషనల్ క్రష్‌గా తన గ్లామర్‌తో ఇండియాని షేక్ చేస్తుంది రష్మిక మందన్నా. నటన పరంగానూ వాహ్ అనిపించే ఈ భామ చిన్నప్పుడు కూడా ముద్దొచ్చేలా ఉంది.
నేచురల్ బ్యూటీ, సహజమైన అందమే కాదు, సహజమైన నటనతో లేడీ పవర్ స్టార్ గా నిలిచిన సాయిపల్లవి చిన్నప్పుడు మరింత క్యూట్‌గా, అందంగా ఉంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. చిన్నప్పుడు తాను కూడా ముద్దుగా, బబ్లీగా ఉంది. ఆ పిక్ చక్కర్లు కొడుతుంది.
హాట్ హీరోయిన్, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అందానికి, హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే చిన్నప్పుడు మాత్రం అంతే క్యూట్‌గా ఉంది. స్కూల్ డేస్ పిక్ వైరల్ అవుతుంది.
బొద్దుగుమ్మ, సహజ నటి నిత్యా మీనన్ సెలక్లీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ అమ్మడు కూడా చిన్నప్పుడు అంతే అందంగా ఉంటూ ఆకట్టుకుంది. స్కూల్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.
తెలుగు తెర చందమామ, సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న కాజల్.. చిన్నప్పుడు క్యూట్‌గానే కాదు, చాలా చాలాకీగా కనిపిస్తుంది. ఆ పిక్స్ వైరల్ అవుతుంది.
హాట్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌ని తన నడుముతో ఊపేసింది. త్వరలో ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను చిన్నప్పుడు మాత్రం బబ్లీగా ఉంటూ ముద్దొచ్చేలా ఉంది.
డస్కీ బ్యూటీ, హాట్ హీరోయిన్ అమలాపాల్.. తెలుగు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆకట్టుకుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అంతే అందగా ఉంటూ ఆకట్టుకుంటుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు బోల్డ్ గా మారి సంచలనం సృష్టిస్తుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అదే అందంతో ఆకట్టుకుంది. చిన్నప్పటి ఫోటోలు చురుకుగా కనిపిస్తుంది.
కమల్ తనయ శృతి హాసన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే చిన్నప్పు ఈ భామ చాలా అందంగా ఉంది. కాకపోతే చాలా ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఇందులో ఓ రేర్ పిక్ చక్కర్లు కొడుతుంది.
సమంత.. లేడీ సూపర్ స్టార్‌గా టర్న్ తీసుకుంటుంది. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఇప్పుడే సెటిల్ అయ్యింది. వరుస సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో సమంత ఎంతో క్యూట్‌గా, ముద్దొచ్చేలా ఉంది.
హాట్ హీరోయిన్.. టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పి బాలీవుడ్ దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పుడు చాలా బబ్లీగా ఉంది. ఎంతో క్యూట్‌గా, ఆకట్టుకుంటుంది.
అందాల రాశీఖన్నా ఎప్పుడైనా అందంగానే ఉంటుంది. అయితే చిన్నప్పుడు ఈ బ్యూటీ కూడా బబ్లీగా ఉంది. చాలా బొద్దుగా కనిపిస్తూ ఎంతో క్యూట్‌గా ఉంది.
స్టార్ హీరో సూర్య భార్య, హీరోయిన్ జ్యోతిక చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉంది. కాస్త బబ్లీగా ఉంటూ ఎంతో ఆకట్టుకుంటుంది. ఆమె ముద్దొచ్చేలా ఉంది. చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతుంది.
ఆపిల్ బ్యూటీ, పాలబుగ్గల సుందరి హన్సిక ఇప్పుడు ఎంతో అందంగా ఉందో, చిన్నప్పుడు అంతే క్యూట్‌గా ఉంది. ఆమె చిన్న నాటి ఫోటో సైతం నెట్టింట వైరల్ అవుతుంది.
యోగా బ్యూటీ, టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే జేజమ్మ అనుష్క శెట్టి చిన్నప్పుడు మాత్రం ముద్దొచ్చేలా ఉంది. అంతే అందంగా ఉంది. అదే అందం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు.