కాజల్ తాజాగా అభిమానులతో చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో భాగంగా మార్నింగ్ లేవగానే మీరు చేసే మొదటి పని ఏంటి అని అడిగారు అభిమాని. దీనికి కాజల్ స్పందిస్తూ, నా కుమారుడికి, నా భర్తకి హగ్‌తోపాటు కిస్ ఇస్తాను అని పేర్కొంది. దీంతోపాటు సమృద్ధిగా కృతజ్ఞత పాటిస్తానని, వేడి నీటిని తాగడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం, ప్రార్థన చేయడం, వార్తాపత్రికలు చదవడం, ఇంట్లో ఉన్నప్పుడు నీల్ అల్పాహారం రెడీ చేసి అతనికి తినిపించడం, పనిలో ఉన్నప్పుడు రెడీ అయి షూట్‌కి వెళ్లడం చేస్తానని తెలిపింది కాజల్.