తల్లిని చేసిన అజ్ఞాతవ్యక్తి ఫోటో పోస్ట్ చేసిన ఇలియానా... ఆ లక్కీ ఫెలో ఇతడేనా? 

Published : Jul 02, 2023, 06:26 PM IST

హీరోయిన్ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లైన విషయం తెలిసిందే. తన గర్భానికి కారణం ఎవరో ఇలియానా ఇంకా చెప్పలేదు. అయితే మొదటిసారి ఆ వ్యక్తి ఫోటో షేర్ చేసింది.   

PREV
16
తల్లిని చేసిన అజ్ఞాతవ్యక్తి ఫోటో పోస్ట్ చేసిన ఇలియానా... ఆ లక్కీ ఫెలో ఇతడేనా? 
Ileana D cruz

ఇలియానా గర్భానికి కారణం ఎవరో ఇంకా తెలియదు. ఆమె చెప్పలేదు. సూచాయగా హింట్స్ ఇస్తుంది కానీ, వివరాలు వెల్లడించడం లేదు. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తల్లి కావడం గొప్ప విషయమన్నారు. మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందన్నారు.  అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని ఇలియానా తెలిపింది. అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా అన్నారు. 

26

అయితే ఆ వ్యక్తి పేరు ఇలియానా చెప్పలేదు. లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయనపై అభిమానం, ప్రేమ చాటుకున్నారు. దీంతో సస్పెన్సు కొనసాగుతుంది.

36

తాజాగా అతని ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో కూడా అతని ఫేస్ స్పష్టంగా రివీల్ చేయలేదు. సదరు వ్యక్తి తన పప్పీతో ఆడుకుంటున్నాడు. టాప్ యాంగిల్ నుండి ఫోటో తీయడంతో ముఖం అస్పష్టంగా ఉండిపోయింది. ఈసారి కూడా ఇలియానా అభిమానులను ఊరించి వదిలేసింది. 

46
Ileana

కాగా హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో సహజీవనం చేసిన ఇలియానా గర్భం దాల్చారనే వాదన ఉంది. లేటెస్ట్ పోస్ట్ లో అస్పష్టంగా ఆ వ్యక్తి ముఖాన్ని ఇలియానా రివీల్ చేసింది. కాగా ఇలియానా కొద్దిరోజుల క్రితం ఇలియానా ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఇది హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె సహజీవనం చేసి తల్లి అయ్యారు. 
 

56


గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతడితో విడిపోయింది. అప్పటి నుండి ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సడన్ గా ఇలియానా గర్భం దాల్చడంతో ఆమె సింగిల్ కాదని తేలిపోయింది. ఇక ఇలియానాకు నెలలు దగ్గరపడ్డాయి. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఇలియానాకు 7 నెలలు దాటి ఉండవచ్చు. 

66


ఇక ఇలియానా కెరీర్ ఫేడ్ అవుట్ దశలో ఉంది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తుంది. ఇటీవల 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ నిరాశపరిచింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించింది. చూస్తుంటే ఇలియానా కెరీర్ ముగిసినట్లే ఉంది. 

click me!

Recommended Stories