మరికొద్ది రోజుల్లో 2024 వెళ్లిపోతోంది. 2025కు ప్రపంచం స్వాగతం పలకబోతోంది. తెలుగులో వచ్చిన హిట్ లు, ఫ్లాఫ్ లు రివ్యూ చేసుకుంటన్నాం. ఈ క్రమంలో ఇప్పటికే 2024లో సూపర్ హిట్ సినిమాలు గురించి మాట్లాడుకున్నాం. గత ఏడాదితో పోలిస్తే సక్సెస్ రేటు పెరగడంతో సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కల్కి, పుష్ప 2, దేవర వంటి చిత్రాలు భాక్సాఫీస్ ని దద్దరిల్లేలా చేసాయి. 2024 లో విజయాలతో పాటు పరాజయాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.
భారీ అంచనాలతో ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చాయి. ఇప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని బిగ్ బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచి నిర్మాతలకు నష్టాలను మిగిల్చిన సినిమాలు గురించి మాట్లాడుకుందాం . ఆ మూవీస్ ఇవే..
సైంధవ్:
వెంకటేష్. హిట్ టైటిల్ తోనే రెండు హిట్లు కొట్టిన డైరెక్టర్ శైలేశ్ కొలను. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'సైంధవ్'. ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం కావడం మరో విశేషం. తన కెరీర్ లో ఎన్నో డీసెంట్ హిట్స్ అందించిన వెంకటేష్ సైంధవ్ సినిమాతో అతి పెద్ద పరాజయాన్ని చవిచూశాడు.
ఈ సినిమా ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందంటే సంక్రాంతి సెలవులు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. సైంధవ్ కోసం వెంకటేష్ యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెట్టాడు. సినిమాలో ఆ పార్ట్ పెద్దగా విఫలమైంది.
ఈగల్ :
మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ఈగల్ బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫ్లాఫ్ అయ్యింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఎక్కువ భాగం యూరప్‌లో చిత్రీకరించబడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించింది. దావ్ జాంద్ సినిమాకి సంగీతం అందించారు. మిగతా సినిమాల పోటి రావటంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది.
ఆపరేషన్ వాలెంటైన్:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భారీ డిజాస్టర్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' . శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా మార్చి 1న థియేటర్లో విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.
వరుణ్ తేజ్ పాన్-ఇండియన్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ దేశవ్యాప్తంగా ఘోరంగా ఫెయిలైంది. ఈ చిత్రం మినిమం ఫుట్‌ఫాల్స్‌ను కూడా రిపోర్ట్ చేయటంలో విఫలమైంది. ఈ చిత్రంలో నవదీప్, రుహాని శర్మ, పరేష్ పహుజా, షతాఫ్ ఫిగర్, సంపత్, అలీ రెజా మరియు మరిన్నింటితో సహా ఒక నక్షత్ర తారాగణాన్ని కలిగి ఉంది, ఆపరేషన్ వాలెంటైన్ ఒక వైమానిక యాక్షన్ డ్రామా, ఇది ప్రేక్షకులను ఆకర్షించింది.
మనమే:
శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వాకి సరైన సాలిడ్ హిట్ ఒకటి రావడం లేదు. అలాంటి శర్వా.. బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న కృతి శెట్టితో కలిసి మనమే అనే చిత్రాన్ని చేశాడు. మరి ఈ చిత్రం జూన్ 7న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది.
కానీ చివరకు ఇది బోరింగ్ ఫీస్ట్ గా మిగిలిపోయింది. లండన్‌లోని అందమైన లొకేషన్లలో మనమే పూర్తిగా షూట్ చేసారు ఫ్యామిలీ ఎమోషన్స్.. బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం.. అనే కాన్సెప్ట్‌లను తీసుకుని ఈ కథను దర్శకుడు రాసుకున్నట్టుగా కనిపిస్తోంది.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన మనమే చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్.
డబుల్ ఇస్మార్ట్:
రామ్, పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ అని తీశారు. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియెన్స్‌కు బాగానే ఎక్కేసింది. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందని ఆశించారు. పూరి, రామ్‌కి మళ్లీ బ్లాక్ బస్టర్ వస్తుందని భావించారు.
నిర్మాతగా ఛార్మీ దశ తిరుగుతుందనుకున్నారు. అయితే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా రన్ ముగిసింది. ఈ డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా అలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. అలీని అలా ప్రేక్షకుడు చూడలేకపోతాడు.
మిస్టర్ బచ్చన్:
మిస్టర్ బచ్చన్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. రిలీజ్‌కు ముందు మిస్టర్ బచ్చన్‌పై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్స్‌తో పాటు ప్రమోషన్స్‌లో హరీష్ శంకర్ స్పీచ్‌లు, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కారణంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
కానీ ఔట్‌డేటెడ్ స్టోరీ, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని హరీష్ శంకర్ సినిమాలో చూపించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 10 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు ఇరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది.
మట్కా:
బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ కి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సారి పులిస్టాప్ పెట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాను అనుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన మూవీ మట్కా(Matka Movie). అయితే ఈ సినిమా ఏ కోణంలోనూ అంచనాలను అయితే అందుకోలేక పోయింది.
మొదటి ఆటకే డిసాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న… ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేదు. వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో పరుగును చాలా కష్టతరం చేసుకుని మొదటి వారం తర్వాత ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకుంది.