బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక మందాన, గత ఐదేళ్లలో భారీగా ఫేమ్ రాబట్టారు. దీనితో ఆమె పలు ప్రముఖ బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆమె మగవారి లోదుస్తులకు సంబంధించిన ఓ బ్రాండ్ యాడ్ లో పాల్గొన్నారు. సదరు యాడ్ లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించగా, అతని అండర్ వేర్ చూసి మనసు పారేసుకునే ఫిట్నెస్ ట్రైనర్ గా రష్మిక మందాన కనిపించారు.
చేతినిండా సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్న రష్మిక, ఇలాంటి యాడ్ లో నటించడం అవసరమా అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇలాంటి యాడ్స్ లో నటిస్తున్న రష్మిక పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి యాడ్ డైరెక్టర్స్ కూడా లోదుస్తులు అంటే, అమ్మాయిలను ఆకట్టుకునే సాధనాలుగా చూపించడం కొసమెరుపు. కనిపించకుండా లోపల ఉండే లోదుస్తులు అమ్మాయిలను ఆకట్టుకుంటాయని ఏ లాజిక్ తో చెబుతున్నారో వారికే తెలియాలి.
Rashmika
మరోవైపు రష్మిక నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అద్దం ముందు నేలపై కూర్చొని, ముస్తాబవుతున్న పక్కా పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ఆకట్టుకున్నారు.
పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుండగా మొదటిపార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, అల్లు అర్జున్ ఎర్ర చందనం కూలి రోల్ చేస్తున్నారు.