లేడీ వర్సటైల్ యాక్టర్ ప్రియమణి కెరీర్ లో విభిన్న పాత్రలు చేశారు. ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి, అటు గ్లామర్ రోల్స్, ఇటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి మెప్పించారు. పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో డీగ్లామర్ రోల్స్ చేసిన ప్రియమణి, కొన్ని సినిమాల్లో ఏకంగా బికినీ వేసి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడారు.