ఇక సమంత చైతు విడిపోతున్నారు. వీళ్ళ వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందనేది మీడియా కోడై కూస్తున్న వార్త. విడాకుల సంగతి ఏమో కానీ, ఈ జంట విడివిడిగా ఉంటున్నారు అనేది మాత్రం నిజం.
పెళ్లి జరిగిన నాలుగేళ్ళలో ఎప్పుడూ లేనిది, వీరిద్దరూ విడివిడిగా ఉండాల్సిన అవసరం ఏమిటనేది అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక నెల రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నా వీరు కలవలేదు.
ఒక స్టేట్మెంట్ తో క్లారిటీ ఇవ్వలేదు. సమంత మాత్రం తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. దీనితో ఫ్యాన్స్ ప్రధానంగా విడాకుల రూమర్స్ గురించి ఆమెను అడిగారు.
ఆ ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కాకపోతే హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మారుస్తున్నారట కదా, అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు అది రూమర్ మాత్రమే, నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళను అన్నారు. హైదరాబాద్ నా హోమ్ టౌన్ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ గొడవలు ఇలా ఉంటే తాను సొంతగా ప్రారంభించిన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్ ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. సాకీ ప్రారంభించి ఏడాది పూర్తి కాగా, మొదటి యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు.
సాకీ బ్రాండ్ ని ప్రేమించినందుకు, ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న కాలంలో మరిన్ని అందమైన జ్ఞాపకాలు సెలెబ్రేట్ చేసుకుందాం... అంటూ కామెంట్ తో పాటు ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
వైవాహిక జీవితం ఎలా ఉన్నా, కెరీర్, బిజినెస్ సూపర్ సక్సెస్ గా సాగుతుండగా సమంత ఆస్వాదిస్తున్నారు. మనసుకు బాధకలిగినప్పుడు, ఒంటరిగా ఫీల్ అయినప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, తన పెట్ డాగ్స్ తో గడుపుతున్నారు.