రౌడీ హీరో రష్మిక మందన్నాతో విజయ్ దేవర కొండ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట కన్నుల పండుగగా పెళ్లి చేసుకున్నారు. కాగా, రష్మిక పెట్టిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది
నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ హీరో విజయ్ దేవర కొండ వివాహం జరిగి నెల రోజులు దాటింది. పెళ్లై నెలరోజులు దాటినా.. వీరి పెళ్లి ఫోటోలు మాత్రం ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పెళ్లికి వీరు ధరించిన దుస్తులు, జ్యూవెలరీ రీక్రియేట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
23
ఆ క్యూట్ వీడియోలో ఏముంది?
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక యానిమేటెడ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో రష్మిక , విజయ్ దేవరకొండల క్యూట్ కార్టూన్ బొమ్మలు ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ రెండు బొమ్మల మధ్యలో ఉన్న ఒక చిన్న సన్ ఫ్లవర్ (పొద్దుతిరుగుడు పువ్వు) కార్టూన్! దీనికి రష్మిక " Now It's Us Three" అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్: గుడ్ న్యూస్ వచ్చేసిందా?
ఈ పోస్ట్ చూసిన వెంటనే అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది క్యూట్ అని కామెంట్ చేస్తుంటే.. చాలా మంది అప్పుడే రష్మిక ప్రెగ్నెంటా అనే సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
33
సన్ ఫ్లవర్ వెనుక అసలు రహస్యం ఏంటి?
అయితే, రష్మిక ఆ సన్ ఫ్లవర్‌ను దేనికి సంకేతంగా పెట్టిందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రష్మికకు సన్ ఫ్లవర్ అంటే ఇష్టం అని, దాని గురించి కావొచ్చని అంటుంటే, మరికొందరు వారి కొత్త ప్రాజెక్ట్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా, రష్మిక చేసిన ఈ చిన్న పోస్ట్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.