Rashmi Goutham : యాంకర్ రష్మి పెళ్లి చేసుకుందా? అందుకే ఆ షోకు నో చెప్పిందట..?

First Published Jan 24, 2022, 2:28 PM IST

బుల్లితెర హీరోయిన్ గా దూసుకుపోతున్న ‘రష్మీ గౌతం’ తన యాంకరింగ్ సిల్స్, యాక్టింగ్ సిల్స్ తో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. అయితే తాజాగా ఈ సుందరి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.
 

 అయితే ఎప్పుడూ టీవీ షోల్లో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తన సోషల్ మీడియాలోనూ జబర్దస్త్ రేష్మీ ఎప్పుడూ కాస్తంత ఎగ్రిసివ్ గానే ఉంటుంది. రకరకాల సమస్యలు,విషయాలపై ఆమె స్పందిస్తూంటుంది. అంతేకాక తనను ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే వారిని పీకి పాకం పెడుతూంటుంది. 

అప్పట్లో ఆమె కరోనాకు గురై నివారణకు చికిత్స పొందుతున్న తరుణంలో, లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై ఆమె కూడా తనదైన శైలిలో స్పందించింది.  కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఫైర్ అయ్యింది తెలిసిందే. 
 

అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన రష్మీ గౌతమ్, మరోసారి తన మ్యారేజ్ అంశంపై చర్చ కొనసాగతోంది. ఇప్పటి వరకు రష్మీ మాత్రం తన పెళ్లి పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాను పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో పూకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 

జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రెష్మీ అంతకు ముందు కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించారు. ‘గుంటూరు టాకీస్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు రష్మీ గౌతమ్. అయితే జబర్దస్త్ లో తనకు వచ్చిన గుర్తింపుతోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 

అయితే, తనకు ధీటుగా యాంకర్ ‘అనసూయ’ అటు స్పెషల్ సాంగ్స్, పలు కీలక పాత్రల్లో నటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. అప్పటికే తనకు మ్యారేజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఇక మిగిలిన రష్మీ గౌతమ్ పెళ్లిపై ఆడియెన్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 
 

ఈ తరుణంలో రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుందని, హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నట్టు పలువురు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా, తన పెళ్లి కోసమే ‘ఢీ’షోను కూడా మానేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రష్మీ గౌతమ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్చిందే. అయితే సుధీర్-రష్మీ మధ్య రిలేషన్ ఉన్నట్టు వచ్చిన పలు రూమర్లను ఆ మధ్యలోనే ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చారు.  

click me!