ఈ సందర్భంగా సౌతిండియా స్టార్ హీరోలు అల్లు అర్జున్, యశ్‌ల ఫొటోలను పోస్ట్ చేసింది. పుష్ప లుక్‌లో బన్నీ, కేజీఎఫ్ సినిమా లుక్‌లో యశ్ లుక్స్ ను పోస్ట్ చేసిన కంగనా సౌతిండియా స్టార్స్ కు ఆవేశం ఎక్కువని కామెంట్ చేసింది. అందుకు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. దక్షిణాది కంటెంట్‌తో పాటు సూపర్ స్టార్స్‌లో అంత ఆవేశం ఉండడానికి వారు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోవడమే కారణమని చెప్పింది.