నువ్వు గుర్తున్నావ్‌ కాబట్టే ఇప్పటి వరకు బతికున్న.. యాంకర్‌ రష్మికి క్రేజీ ఆన్సర్ ఇచ్చిన సుడిగాలి సుధీర్..

Published : Aug 19, 2023, 06:13 PM ISTUpdated : Aug 19, 2023, 06:53 PM IST

జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి గతంలో జంట పావురం మాదిరిగా ఉండేవారు. కానీ గతేడాది నుంచి దూరమయ్యారు. కానీ తాజాగా మళ్లీ కలిశారు. షో కోసం ఇద్దరు కలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.  

PREV
16
నువ్వు గుర్తున్నావ్‌ కాబట్టే ఇప్పటి వరకు బతికున్న.. యాంకర్‌ రష్మికి క్రేజీ ఆన్సర్ ఇచ్చిన సుడిగాలి సుధీర్..
photo credit-ETV Balagam Promo

సుధీర్‌ ఆ మధ్యనే టీవీ షోస్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీ 28ఏళ్ల సెలబ్రేషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం కోసం సుధీర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. `ఈటీవీ బలగం` పేరుతో స్పెషల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో సుడిగాలి సుధీర్ తోపాటు, రష్మి కలిసి యాంకరింగ్‌ చేయడం విశేషం. దీంతో ఈ షోకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇద్దరు కలిసి చేసిన రచ్చ ఇప్పుడు హైలైట్ గా నిలుస్తుంది. 

26
photo credit-ETV Balagam Promo

ఇందులో సుధీర్‌ తనని వదిలేసి పోవడంపై యాంకర్‌ రష్మి సీరియస్‌గా ఉందట. ఆమె కోపంగా ఉండటాన్ని చూసిన సుధీర్‌.. ఏంటి మేడమ్‌ గారు సీరియస్‌గా ఉన్నారంటూ ప్రశ్నించగా, దానికి రష్మి రియాక్షన్‌ అదిరిపోయింది. నేనసలు గుర్తున్నానా అంటూ కోపంతో అందరిని ముందు సుధీర్‌ని ప్రశ్నించింది. దీనికి సుధీర్‌ పిండేసే ఆన్సర్‌ ఇచ్చాడు. 
 

36
photo credit-ETV Balagam Promo

నువ్వు గుర్తున్నావ్‌ కాబట్టే ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నా అంటూ చెప్పడంతో రష్మి ఒక్కసారిగా కూల్‌ అయిపోయింది. ఆ ఆవేశం, కోపం అన్నీ ఒక్క దెబ్బతో మటుమాయం అయ్యాయి. దీంతో అన్నీ మర్చిపోయి నవ్వులు పూయించింది రష్మి. సుధీర్‌ మాటలకు ఫిదా అయిపోయింది. ఇక గెటప్‌ శ్రీను వీరి ప్రేమపై ప్రశ్నలు సందించారు. ఈ ప్రేమ పక్షుల్లో గాల్లోనే ఎగురుతాయా? గూటికి ఏమైనా చేరుతాయా? అని ప్రశ్నించగా సిగ్గులతో ముగ్గేశారు. మెలికలు తిరుగుతూ అందరిని ఆకట్టుకున్నారు. 
 

46
photo credit-ETV Balagam Promo

అయినా వదలని శ్రీను ఏంటి? పరిస్థితి అని ప్రశ్నించగా, సుధీర్‌ చెప్పిన సమాధానం, అందుకు రష్మి ఎమోషనల్‌ కావడం షాక్‌కి గురి చేస్తుంది. అంతకు ముందు హైపర్‌ ఆది కూడా ఈ ఇద్దరు పెళ్లి విషయాన్ని తెల్చేసేందుకు సిద్ధమయ్యాడు. చాలా రోజుల తర్వాత వచ్చారు, ఆ పెళ్లి ఏదో చేసుకోవచ్చుగా అని అడిగాడు ఆది. ఇంకా రెండేళ్లు ఆగితే మీ ఇద్దరిపై సినిమా తీస్తానని తెలిపారు ఆది. 
 

56
photo credit-ETV Balagam Promo

దీనికి సినిమాకి ఏం పేరు పెడుతున్నారని రష్మి అడగ్గా, `నడవలేని రష్మి పొడవలేని సుధీర్‌` అని టైటిల్‌ పెడతా అని చెప్పడంతో అంతా నవ్వులు విరిసాయి. మొత్తంగా చాలా గ్యాప్‌తో అటు రష్మి, ఇటు సుధీర్‌ కలిసి షోలో మెరవడం, ఎప్పటిలాగే పులిహోర కలుపుతూ, రొమాంటిక్ లుక్స్ తో కనిపించడంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. సుధీర్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చినందుకు అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. 
 

66
photo credit-ETV Balagam Promo

మరి సుధీర్‌ కేవలం ఈ స్పెషల్‌ షో కోసమే వచ్చాడా? కంటిన్యూగా షోలు చేస్తాడా? అనేది చూడాలి. ఇక సుధీర్‌ హీరోగా బిజీగా ఉన్నాడు. ఆ మధ్య `గాలోడు` చిత్రంతో ఆకట్టుకున్నాడు. సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు `కాలింగ్‌ సహస్ర` చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు మరో ఒకటి రెండు చిత్రాలున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories