ఇదిలా ఉండగా గత ఏడాది మంజిమ మోహన్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ ని మంజిమ వివాహం చేసుకుంది. మణిరత్నం కడలి చిత్రంతో గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయం అయ్యాడు. మంజిమ, కార్తీక్ ఇద్దరూ కలసి దేవరట్టం అనే చిత్రంతో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో మంజిమ, గౌతమ్ కార్తీక్ తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లారు. పెళ్లి తర్వాత కూడా మంజిమ మోహన్ మంచి ఆఫర్స్ వస్తే నటించాలని భావిస్తోంది.